ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రెండు పార్టీలకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు: Harish rao

ABN, First Publish Date - 2021-11-30T17:12:47+05:30

వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర  రాద్దాంతం చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కొనుగోళ్ల కేంద్రాలెన్ని, టీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలెన్ని అని ప్రశ్నించారు.  బీజేపీకి, కాంగ్రెస్‌కు రైతుల గురుంచి  మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. వడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుద్ధ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ విషయంలో పీయూష్ గోయల్‌ ఒకలా..,  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  మాటలు మరోలా ఉంటున్నాయని, ఇద్దరిలో ఎవరిది కరెక్టు అనేది వారే తేల్చుకోవాలని తెలిపారు. కేంద్రం తీరు వల్లే తడిసిన వడ్లు కొనలేకపోతున్నామని అన్నారు. రూ.4,400 కోట్లతో భసవేశ్వర, సంగమేశ్వర  ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.          

Updated Date - 2021-11-30T17:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising