ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
ABN, First Publish Date - 2021-06-18T05:30:00+05:30
ఈ నెల 20న సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటనలో భాగంగా సిద్దిపేటలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు శుక్రవారం క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు.
సిద్దిపేట టౌన్, జూన్ 18: ఈ నెల 20న సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటనలో భాగంగా సిద్దిపేటలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు శుక్రవారం క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. త్వరగా మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్‌డేవిస్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-06-18T05:30:00+05:30 IST