ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న సాగర్ ముంపు బాధితుల వెతలు

ABN, First Publish Date - 2021-08-17T23:09:58+05:30

మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ముట్రాజపల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో బాధితులు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చిన్నపాటి వర్షాలకే డబుల్ బెడ్రుమ్ ఇళ్లకు పగుళ్లు, పెచ్చులు ఉడుతుండడంతో అష్ట కష్టలు పడుతున్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుగులోత్ మోహన్ అనే చౌకధరల దుకాణానికి చెందిన ఇంట్లో కొద్ది రోజులుగా గోడలకు నెర్రలు ఏర్పడటంతో ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు గజ్వేల్‌లో గత రాత్రి నుంచి అడపదడపా వర్షం పడటంతో ఇంట్లోకి నీళ్లు చేరి చౌకధరల దుకాణంలో ఉండే దాదాపు 10 క్వింటాళ్ల బియ్యం తడిసి ముద్దయింది.పగుళ్లు ఎక్కువ అవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యను  సంబంధిత కాంట్రాక్టరు దృష్టికి తీసుకెళ్లడంతో మరమ్మతులు చేపట్టారు. 

Updated Date - 2021-08-17T23:09:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising