ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ సడలింపుతో పశువుల అంగడి కళకళ

ABN, First Publish Date - 2021-06-12T05:47:47+05:30

లాక్‌డౌన్‌ సడలింపుతో ప్రతి శుక్రవారం జరిగే రాష్ట్రంలో పేరొందిన హుస్నాబాద్‌ పశువులు, మేకల అంగడి కళకళలాడింది.

కొనుగోళ్లతో కళకళలాడుతున్న పశువులు, మేకల అంగడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోరుగా కాడెడ్ల కొనుగోళ్లు

ఎద్దుల జతకు రూ. లక్ష పైనే పలికిన ధర


హుస్నాబాద్‌, జూన్‌ 11: లాక్‌డౌన్‌ సడలింపుతో ప్రతి శుక్రవారం జరిగే రాష్ట్రంలో పేరొందిన హుస్నాబాద్‌ పశువులు, మేకల అంగడి కళకళలాడింది.  నాలుగు వారాలుగా లాక్‌డౌన్‌తో వెలవెలబోయిన అంగడికి శుక్రవారం రైతులు భారీగా తరలివచ్చారు. మేకలు, గొర్లు, పశువుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులను దృష్టిలో పెట్టుకొని రైతులు కాడెడ్లను కొనుగోలు చేశారు. దీంతో వీటి ధరలు ఆమాంతం పెరిగాయి. నాణ్యమైన జాతి రకం ఎద్దుల జతకు లక్ష రూపాయలకు పైమాటే పలికింది.


లాక్‌డౌన్‌ విధించిన మొదటి రెండు వారాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తరువాత రెండు వారాలు ఒంటి గంట వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఉండటంతో దూర ప్రాంతాల నుంచి రైతులు అంగడికి రాలేక పోయారు. ప్రస్తుతం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలింపు సమయం ఉండడంతో రైతులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోళ్లు జరిపారు. అయితే భౌతిక దూరం మాత్రం పాటించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.


Updated Date - 2021-06-12T05:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising