ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొంచెం తీపి.. కొంచెం చేదు

ABN, First Publish Date - 2021-08-03T04:59:38+05:30

ఎట్టకేలకు రుణమాఫీ విషయంలో రైతులకు తీపికబురు అందింది. 2014 సంవత్సరం నుంచి 2018 డిసెంబర్‌ వరకు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తొలివిడతగా రూ.25 వేల లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేశారు. మలి విడతగా రూ.50 వేల లోపు రుణం ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో రూ.50వేల లోపు రుణగ్రస్తులు 24,610 మంది

ఆపైబడిన రైతులు ఇంకా 1,22,945 మంది 

కొమురవెల్లిలోని ఎల్లమ్మగుట్ట, త్రిశూలం, ఢమరుకం నమూనా


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 2 : ఎట్టకేలకు రుణమాఫీ విషయంలో రైతులకు తీపికబురు అందింది. 2014 సంవత్సరం నుంచి 2018 డిసెంబర్‌ వరకు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తొలివిడతగా రూ.25 వేల లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేశారు. మలి విడతగా రూ.50 వేల లోపు రుణం ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్దిపేట జిల్లాలోని 24,610 మంది రైతులకు ఉపశమనం లభించనుంది. 


రూ.114 కోట్లు మాఫీ

పంట రుణాలు పొందిన 1,67,701 మంది రైతుల్లో మొదటి విడతలో అంటే రూ.25వేల లోపు రుణం తీసుకున్న 20,146 మంది రైతులకు రూ.27 కోట్లు మాఫీ అయ్యాయి. సిద్దిపేట జిల్లాలో రూ.50వేల లోపు రుణం పొందిన వారిలో 24,610 మంది రైతులు ఉన్నట్లు గుర్తించారు. వారికి మొత్తంగా రూ.87 కోట్ల వరకు మాఫీ కానున్నాయి. ఆగస్టు 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వీరి రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో మొత్తంగా రూ.114 కోట్లు ప్రభుత్వమే భరించనున్నది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,67,701 మంది రైతులు రూ.1,074 కోట్ల రుణాలు పొందారు. వీరిలో మొదటి, రెండో విడత పోగా 1,22,945 మంది రైతులకు ఇంకా మాఫీ కావాల్సి ఉంటుంది. వారంతా రూ.50వేలకు పైబడి రుణాన్ని పొందినవారు. మొత్తంగా రూ.960 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.  

Updated Date - 2021-08-03T04:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising