ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహనీయుల ఆశయాలను సాధిద్దాం

ABN, First Publish Date - 2021-01-27T05:46:29+05:30

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట: మహనీయుల ఆశయాలను సాధించడానికి ప్రతీ ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలని రాష్ట్రఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

సిద్దిపేటలోని చారిత్రక బురుజు వద్ద గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు  

 త్రివర్ణ శోభితంగా సిద్దిపేట బురుజు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట:  మహనీయుల ఆశయాలను సాధించడానికి ప్రతీ ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలని రాష్ట్రఆర్థికశాఖ మంత్రి  తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం సిద్దిపేటలోని చారిత్రక బురుజుపై ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మొన్నటిదాకా శిథిలావస్థలో ఉన్న చారిత్రక బురుజును త్రివర్ణ శోభితంగా తీర్చిదిద్దారు. దీనిపై తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయగా మంత్రి ఆవిష్కరించారు. బురుజు చుట్టూరా మూడు రంగులతోపాటు మధ్యలో అశోక చక్రాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. బురుజు వద్ద నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  అంతకుముందు మంత్రి హరీశ్‌రావు తన నివాసంలో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ‘సుడా’ చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, దీప్తినాగరాజు, గ్యాదరి రవీందర్‌, సాకి ఆనంద్‌,యూత్‌ అధ్యక్షుడు ఇర్షాద్‌ హుస్సేన్‌, నాయకులు చేపూరి శేఖర్‌గౌడ్‌, నాయకం వెంకటేశ్‌, నవీన్‌గౌడ్‌ పాల్గొన్నారు.  




Updated Date - 2021-01-27T05:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising