ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం : మున్సిపల్‌ కమిషనర్‌

ABN, First Publish Date - 2021-10-23T04:43:15+05:30

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మించి పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిస్తూ మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది శుక్రవారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు.

అవగాహనా ర్యాలీలో పాల్గొన్న కమిషనర్‌ శ్రీహరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ మున్సిపాలిటీ/జిన్నారం, అక్టోబరు 22 : ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మించి పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిస్తూ మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది శుక్రవారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారుల గుండా తిరిగి కార్యాలయానికి చేరుకున్నది. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని నిషేధించిందని, ప్రజలు గమనించాలన్నారు. ఈ ర్యాలీలో కౌన్సిలర్‌ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, డీఈ మహే్‌షకుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వనిత, మెప్మా సిబ్బంది దేవపాల, ఆర్పీలు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో ప్లాస్టిక్‌ కవర్ల నిషేధంపై చైర్‌పర్సన్‌, అధికారులు అవగాహన కల్పించారు. శుక్రవారం మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌ రోజారాణి, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, కౌన్సిలర్లు, అధికారులు పర్యటించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పట్టణంలో పూర్తిగా నిషేధించామని, 75 మైక్రాన్స్‌ కంటే తక్కువగా ఉండే ప్లాస్టిక్‌ను వ్యాపారులు, వినియోగదారులు ఉపయోగించకూడదని తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారికి రూ.500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-23T04:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising