ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిథిలావస్థలో ఖమ్మంపల్లి పాఠశాల

ABN, First Publish Date - 2021-09-17T04:40:29+05:30

ఖమ్మంపల్లి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతుల్లో 90 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

శిథిలావస్థలో ఉన్న ఖమ్మంపల్లి ప్రాథమిక పాఠశాల భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉరుస్తున్న తరగతి గదులు

 పెచ్చులూడుతున్న పైకప్పు

 చెమ్మ వస్తున్న గోడలు

 బిక్కుబిక్కుమంటూసాగుతున్న చదువులు


కొండపాక, సెప్టెంబరు 16 : ఖమ్మంపల్లి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతుల్లో 90 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొన్నేళ్లుగా రెండు గదుల్లోనే విద్యాభ్యాసం సాగుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తరగతి గదుల్లో నీరు నిండిపోయింది. భవనం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. గోడలకు చెమ్మర రావడంతో ఎప్పుడు కూలిపోతాయో తెలియడం లేదు. దీంతో విద్యార్థులను ఆరుబయట కూర్చుండబెట్టి బోధన సాగిస్తున్నారు. మధ్యాహ్న భోజనం సైతం ఆరుబయటనే చేస్తున్నారు.




అవకాశమున్నా.. చర్యలు శూన్యం


ఖమ్మంపల్లి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత పాఠశాల కొనసాగుతున్నది.  అయితే ఉన్నత పాఠశాల కోసం గ్రామంలో మరోచోట నూతన భవనం సిద్ధం చేశారు. ఉన్నత పాఠశాలను కొత్త భవనంలోకి తరలిస్తే ప్రస్తుత హైస్కూల్‌ గదుల్లోకి ప్రాథమిక పాఠశాలను మార్చడానికి అవకాశం ఉన్నది. కానీ కొత్తగా నిర్మించిన భవనానికి ప్రారంభోత్సవం నిర్వహించలేదని ఉన్నత పాఠశాలను తరలించడం లేదు. ప్రాథమిక పాఠశాల దుస్థితిని గ్రామస్థులు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు స్పందించడం లేదు. చిన్నారుల భద్రతను, చదువులను దృష్టిలో ఉంచుకుని ప్రైమరీ స్కూల్‌ తరగతులను మార్చాలని ఎస్‌ఎంసీ చెర్మన్‌, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


 



Updated Date - 2021-09-17T04:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising