ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి కొండపోచమ్మ తల్లి

ABN, First Publish Date - 2021-01-17T05:44:48+05:30

భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన కొండపోచమ్మ ఆలయం ఉత్సవాలకు సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నెల 18న ఉత్సవాలు ప్రారంభం

మూడునెలల పాటు ఉత్సవాలు

వేలాదిగా తరలిరానున్న భక్తులు

జగదేవ్‌పూర్‌, జనవరి 16 : భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన కొండపోచమ్మ ఆలయం ఉత్సవాలకు సిద్ధమైంది. తెలంగాణ ప్రాంతంలోని ప్రసిద్ధిగాంచిన కొండపోచమ్మ దేవస్థానం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలోని తిగుల్‌నర్సాపూర్‌ గ్రామానికి ఉత్తరదిశలో ఉంది. భక్తులకు ఆరాధ్య దైవమై నిత్య పూజలు అందుకుంటున్న కొండపోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రతియేటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడునెలల పాటు ఘనంగా జరుగుతుంటాయి. ఈ యేడు అమ్మవారి ఉత్సవాలు 18న ప్రారంభమై ఉగాది వరకు కొనసాగనున్నాయి. ఈ జాతరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి భువనగిరి, జనగామ తదితర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కొండపోచమ్మ జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్య నిర్వహణాధికారి మోహన్‌రెడ్డి తెలిపారు. గజ్వేల్‌--ప్రజ్ఞాపూర్‌, జనగామ, కుషాయిగూడ, సిద్దిపేట బస్‌ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారన్నారు. అలాగే జాతరకు లక్ష నుంచి రెండు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నదని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని సర్పంచ్‌ రజితారమేష్‌ తెలిపారు. పారిశుధ్య పనుల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించామని చెప్పారు. 

కొండపోచమ్మా.. సమస్యలు తీరేదెన్నడో?

తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన కొండపోచమ్మ ఆలయాన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. తెలంగాణలో ఆలయాలకు ప్రభుత్వం రూ. కోట్ల నిధులు కేటాయించినా కొండపోచమ్మ అభివృద్ధిపై చిన్నచూపు చూస్తున్నది. ఇక్కడ నీళ్ల వసతి, మరుగుదొడ్లు, మూత్రశాలల సదుపాయాలు సరిగా లేక ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది. 2017 నవంబరులో ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, యాక్షన్‌ప్లాన్‌ తయారు చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఆదేశించారు. కానీ నేటివరకూ అభివృద్ధి జరగలేదు. మంత్రి హామీ ఇచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా.. నేటికీ నిధులు కేటాయించకపోవడం విశేషం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆలయ పాలకవర్గం ఏర్పాటుతో పాటు ఆలయం వద్ద నీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్‌ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

Updated Date - 2021-01-17T05:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising