ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 24, 25న ఐఐటీహెచ్‌లో జపాన్‌ డే

ABN, First Publish Date - 2021-09-19T04:19:54+05:30

సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో ఈనెల 24, 25న జపాన్‌ డే ఎడిషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంది, సెప్టెంబరు 18 : సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో ఈనెల 24, 25న జపాన్‌ డే ఎడిషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐఐటీహెచ్‌, జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (జెట్రో), జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆర్గనైజేషన్‌ ఏజెన్సీ (జైకా) సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో ఈ సంవత్సరం 13 జపాన్‌ కంపెనీలు నాలుగవ సారి జాబ్‌మేళాకు కొవిడ్‌-19 కారణంగా ఆన్‌లైన్‌ ద్వారా హాజరుకానున్నాయి. ఇందుకు సంబంధించి ఐఐటీహెచ్‌ అధికారులు జపాన్‌ డే 2021 పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యానికి ఐఐటీహెచ్‌ విద్యార్థులకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. 2018 నుంచి ఐఐటీహెచ్‌లో నిర్వహిస్తున్న జపాన్‌ డే ద్వారా రూపొందించిన స్టార్ట్‌పలు ప్రపంచ మార్కెట్‌లో పోటీపడేలా ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి దేశీయ విద్యార్థులను, ప్రపంచస్థాయి అగ్రశ్రేణి ప్రతిభావంతులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జపాన్‌ డే ఎడిషన్‌ విజయవతం కావాలని, ఈ ప్లేస్‌మెంట్‌ ద్వారా ఐఐటీహెచ్‌ విద్యార్థులకు జపనీస్‌ కంపెనీల్లో ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నానని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బిఎ్‌స.మూర్తి వెల్లడించారు. 

Updated Date - 2021-09-19T04:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising