ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట కలెక్టర్‌ను అడిగి పంట వేసుకోవాలా?: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2021-10-26T21:33:54+05:30

రైతులకు సొంత నిర్ణయంతో పంట వేసుకునే స్వేచ్ఛ లేదా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రైతులకు సొంత నిర్ణయంతో పంట వేసుకునే స్వేచ్ఛ లేదా?.. సిద్దిపేట కలెక్టర్‌ను అడిగి పంట వేసుకోవాలా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. అగ్రికల్చర్ మీటింగ్‌లో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యాలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ఏ పంట వేసుకోవాలో చెప్పడానికి కలెక్టర్ ఎవరని అన్నారు. ఆయన రైతులను శాసించేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంకట్రామిరెడ్డి మంగళవారం సాయంత్రంలోగా రైతులకు క్షమాపణ చెప్పకపోతే.. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.


అగ్రికల్చర్ మీటింగ్‌లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని వెంటాడుతా, వేటాడుతా.. అంటూ హెచ్చరించారు. వరి విత్తనాలు అమ్మె హక్కు ఎవరికీ లేదన్నారు. కలెక్టర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతుల మండిపడుతున్నారు.

Updated Date - 2021-10-26T21:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising