ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఆవిష్కరణలకు ఆహ్వానం

ABN, First Publish Date - 2021-07-27T03:40:01+05:30

‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ కార్యక్రమానికి ఔత్సాహిక ఆవిష్కర్తల నుంచి నూతన ఆవిష్కరణలపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఏ రంగానికి సంబంధించినదైనా సమస్యకు పరిష్కారం కొనుగొనే కొత్త విధానాన్ని ఆవిష్కరణగా గుర్తిస్తామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ రూరల్‌/సంగారెడ్డి రూరల్‌, జూలై 26: ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ కార్యక్రమానికి ఔత్సాహిక ఆవిష్కర్తల నుంచి నూతన ఆవిష్కరణలపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మెదక్‌  జిల్లా  కలెక్టర్‌ హరీశ్‌, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఏ రంగానికి సంబంధించినదైనా సమస్యకు పరిష్కారం కొనుగొనే కొత్త విధానాన్ని ఆవిష్కరణగా గుర్తిస్తామన్నారు. కొత్త పరికరం తయారు చేయడాన్ని, పరికరాల తయారీలో కొత్త వస్తువలు వాడటాన్ని, పాత వస్తువునే మరింత ఎక్కువగా ఉపయోగపడేలా చేయడాన్ని ఆవిష్కరణగా పరిగణిస్తారని వివరించారు. కొత్త ఆవిష్కరణలను రూపొందించినవారు అందుకు సంబంధించి ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియో, ఆవిష్కరణ నాలుగు ఫొటోలు జతచేసి పేరు, వయస్సు, వృత్తి, గ్రామం, జిల్లా, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలను 9100678543 నంబర్‌కు ఆగస్టు 10 వరకు వాట్సాప్‌ చేయాలని సూచించారు. ఎంపికైన ఆవిష్కరణలను స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే తమ ఆవిష్కరణలను ప్రదర్శించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉత్సాహవంతులైనవారు తమ ఆవిష్కరణలను నమోదు చేసకోవాలని కోరారు.

Updated Date - 2021-07-27T03:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising