ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పతాగి డయల్‌ 100కు పలుమార్లు ఫోన్‌

ABN, First Publish Date - 2021-05-20T05:53:32+05:30

మండలంలోని అనంతసాగర్‌ గ్రామానికి చెందిన అంగోల్ల శ్రీనివాస్‌ మంగళవారం సాయంత్రం మద్యం తాగి డయల్‌ 100కు 13 సార్లు ఫోన్‌ చేసి పోలీసు అధికారులను విసిగించడమే కాకుండా, వారి విధులకు ఆటంకపర్చడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు నారాయణఖేడ్‌ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసు నమోదు చేసిన పోలీసులు

నారాయణఖేడ్‌, మే 19: మండలంలోని అనంతసాగర్‌ గ్రామానికి చెందిన అంగోల్ల శ్రీనివాస్‌ మంగళవారం సాయంత్రం మద్యం తాగి డయల్‌ 100కు 13 సార్లు ఫోన్‌ చేసి పోలీసు అధికారులను విసిగించడమే కాకుండా, వారి విధులకు ఆటంకపర్చడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు నారాయణఖేడ్‌ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్నవారు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సాయం కోసం 100 నంబరుకు ఫోన్‌ చేసే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. కానీ శ్రీనివాస్‌ తాగిన మైకంలో 13 సార్లు ఫోన్‌ చేయడంతో తాము ఎమర్జెన్సీ ఉందేమోనని అతడిని సంప్రదించడానికి ప్రయత్నించామన్నారు. అతడి ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేక పోవడంతో బ్యాలెన్స్‌ వేసి మరీ ఫోన్‌ చేసి మాట్లాడామని ఎస్‌ఐ వివరించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో గ్రామానికి వెళ్లి పరిశీలించగా మద్యం తాగి, డబ్బులు ఇవ్వమని భార్యతో గొడవ పడుతున్నాడన్నారు. ఫోన్‌ ఎందుకు చేశావని ప్రశ్నిస్తే తనను తన భార్య కొడుతున్నదని సమాధానం ఇచ్చాడన్నారు. మద్యం తాగి అకారణంగా పలుమార్లు 100కు డయల్‌ చేసి విధులను ఆటంక పర్చినందుకు శ్రీనివా్‌సపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-20T05:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising