ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుస్నాబాద్‌ మున్సిపల్‌లో.. రూ.25 లక్షలతో అభివృద్ధి పనులకు ఆమోదం

ABN, First Publish Date - 2021-08-28T05:23:12+05:30

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత అధ్యక్షతన శుక్రవారం హుస్నాబాద్‌ మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది.

సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ ఆకుల రజిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం

హుస్నాబాద్‌, ఆగస్టు 27: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత అధ్యక్షతన  శుక్రవారం హుస్నాబాద్‌ మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. సమావేశంలో 12 అంశాలపై సభ్యులు చర్చించారు.  ఇందులో పార్కులు అభివృద్ధి చేయాలని, డంపింగ్‌యార్డు, డీఆర్‌సీసీ కేంద్రానికి ట్రాన్స్‌ఫార్మర్‌ థర్డ్‌ వైర్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఎల్లమ్మ చెరువు వద్ద ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు. మొత్తం రూ.25లక్షల అభివృద్ధి పనులకు ఈ సమావేశంలో అమోదం తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా దోమల మందును కొనుగోలు చేయాలని, పట్టణంలో ఉన్న పందులను ఊరి బయటకు తరలించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజమల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, కౌన్సిలర్లు కొంకటి నళినిదేవి, గూళ్ల రాజు, వాల సుప్రజ, దొడ్డి శ్రీనివాస్‌, గోవిందు రవి, కోమటి స్వర్ణలత, పెరుక భాగ్యారెడ్డి, మ్యాదరబోయిన శ్రీనివాస్‌, వల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-08-28T05:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising