ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్‌ఫోన్‌ పోతే మీసేవలో ఫిర్యాదు చేయండి

ABN, First Publish Date - 2021-10-30T04:44:43+05:30

సంగారెడ్డి జిల్లాలో ఎవరైనా సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే మీ సేవా ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ ఎం.రమణకుమార్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డిక్రైం, అక్టోబరు 29 : సంగారెడ్డి జిల్లాలో ఎవరైనా సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే మీ సేవా ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ ఎం.రమణకుమార్‌ సూచించారు. సెల్‌ఫోన్లు పోయాయని మీసేవా ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో పదింటిని సంగారెడ్డి సైబర్‌క్రైం పోలీసులు చేధించారు. ఏడు ఫోన్లను సంబంధిత ఫిర్యాదుదారులకు ఎస్పీ రమణకుమార్‌, ఏఎస్పీ కె.సృజన శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎవరికైనా సెల్‌ఫోన్లుకానీ, వస్తువులు కానీ దొరికినట్లయితే స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో అందజేయాలని సూచించారు. సెకండ్‌హ్యాండ్‌ సెల్‌ఫోన్లను కొనుగోలు చేసే ముందు సంబంధిత వ్యక్తి నుంచి ఫోన్‌ కొన్న బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సెల్‌ఫోన్లను రికవరీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఐటీసెల్‌ సభ్యులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో స్పెషల్‌బ్రాంచ్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ నాయుడు, ఐటీ సెల్‌ ఎస్‌ఐ కృష్ణయ్య, సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising