ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవవైవిధ్య చెరువుకు ఆక్రమణల గండం

ABN, First Publish Date - 2021-06-19T05:30:00+05:30

అమీన్‌పూర్‌ జీవవైవిధ్య చెరువు ఆక్రమణ కొనసాగుతూనే ఉన్నది.

అమీన్‌పూర్‌ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్‌లో మట్టిని నింపుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమీన్‌పూర్‌ పెద్దచెరువులో కొనసాగుతున్న పూడ్చివేతలు

చెరువు మధ్యలో గతంలో తొలగించిన రోడ్డు పునర్నిర్మాణం

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్‌

పటాన్‌చెరు, జూన్‌ 19: అమీన్‌పూర్‌ జీవవైవిధ్య చెరువు ఆక్రమణ కొనసాగుతూనే ఉన్నది. చెన్నై హరిత ట్రిబ్యునల్‌, రాష్ట్ర హైకోర్టు చెరువు ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తంచేసి వారం గడవకముందే చెరువు పూడ్చివేత పనులు నిరాటంకంగా కొనసాగడం అక్రమార్కుల బరితెగింపుకు నిదర్శనం. గతంలోనే పెద్దఎత్తున చెరువు శిఖం, బఫర్‌జోన్లు కబ్జాకు గురయ్యాయి. రెవెన్యూ, ఇరిగేషన్‌ రికార్డుల ప్రకారం పెద్దచెరువు విస్తీర్ణం 97 ఎకరాలు కాగా.. ఆక్రమణలతో క్రమంగా కుచించుకుపోతున్నది. చెరువు చుట్టూ కట్టడాలు వెలుస్తున్నాయి. చెరువు ఎఫ్‌టీఎల్‌ను రాత్రికిరాత్రి మట్టితో పూడ్చేస్తున్నారు. గతంలో ఆర్‌కేఎన్‌క్లేవ్‌ పేరుతో చేసిన పంచాయతీ లేఅవుట్‌కు చెరువు మధ్య నుంచి రోడ్డును వేయడం గమనార్హం. వర్షాలు కురిసి చెరువు నిండినప్పుడు రోడ్డు పూర్తిగా మునిగిపోతుంది. చెరువులో నీటి మట్టం తగ్గగానే రోడ్డు తేలుతుంది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ప్రతీఏటా  రోడ్డు ఎత్తును పెంచుతూనే ఉన్నారు. ఇటీవల ఇరిగేషన్‌శాఖ అధికారులు ఈ రోడ్డు అక్రమ నిర్మాణమని తేల్చి అడ్డంగా కందకం తవ్వారు. రియల్‌వ్యాపారులు ఇటీవల కందకాన్ని పూడ్చివేసి రోడ్డును పునరుద్ధరించారు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న వాణినగర్‌కాలనీ ప్లాట్లు చెరువు నీటిలో మునిగిపోయాయి. వాటిని కాపాడుకునేందుకు పెద్దఎత్తున టిప్పర్లతో మట్టిని తరలించి ఎఫ్‌టీఎల్‌ను నింపుతున్నారు. వందలాది ట్రిప్పుల మట్టిని చెరువులో నింపుతున్నా అధికారులు కన్నెత్తి చూడటంలేదు. 

శాఖల మధ్య సమన్వయలోపం

అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపల్‌శాఖలు, హెచ్‌ఎండీఏ మధ్య సమన్వయలోపం అక్రమార్కులకు వరంగా మారింది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు ఇవ్వకూడదని కోర్టులు చెబుతున్నా హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీ అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు జారీచేస్తున్నారు. ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖలు, మున్సిపాలిటీ సమన్వయంతో పనిచేయాల్సినచోట ఎరికివారే అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు. చెరువు ఆక్రమణపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. 


Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising