ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టినరోజున రెండు కుటుంబాలకు ఆపన్నహస్తం

ABN, First Publish Date - 2021-06-04T05:20:23+05:30

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తన పుట్టిన రోజున మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికను అన్నీతానై చదివించి ప్రయోజకురాలిగా తీర్చిదిద్దారు. సిద్దిపేటకు చెందిన భాగ్య చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో బాలసదనంలో ఉంచి చదివించారు. గతేడాది ఘనంగా వివాహం జరిపించారు. తాజాగా గురువారం తన పుట్టినరోజు సందర్భంగా భాగ్యకు పట్టణంలోని కేసీఆర్‌నగర్‌లో డబుల్‌బెడ్రూం ఇంటిని అందజేశారు. తల్లిందడ్రులు లేనిలోటు తెలియకుండా మంత్రి తన జీవితాన్ని తీర్చిదిద్దారని ఆమె ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఆటో కార్మికుడికి అండ

భాగ్యకు డబుల్‌బెడ్‌రూం ఇంటి పట్టాను అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దమనసును చాటుకున్న మంత్రి హరీశ్‌రావు

అనాథ యువతికి అన్నీతానై ఆదుకున్న వైనం

ఆటో కార్మికుడి కుటుంబానికి ఆర్థిక భరోసా

పుట్టిన రోజున గొప్ప సంతృప్తి : మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, జూన్‌ 3: ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తన పుట్టిన రోజున మానవత్వాన్ని  చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికను అన్నీతానై చదివించి ప్రయోజకురాలిగా తీర్చిదిద్దారు. సిద్దిపేటకు చెందిన భాగ్య చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో బాలసదనంలో ఉంచి చదివించారు. గతేడాది ఘనంగా వివాహం జరిపించారు. తాజాగా గురువారం తన పుట్టినరోజు సందర్భంగా భాగ్యకు  పట్టణంలోని కేసీఆర్‌నగర్‌లో డబుల్‌బెడ్రూం ఇంటిని అందజేశారు. తల్లిందడ్రులు లేనిలోటు తెలియకుండా మంత్రి తన జీవితాన్ని తీర్చిదిద్దారని ఆమె ఆనందాన్ని వ్యక్తంచేశారు. 

ఆటో కార్మికుడికి అండ

రెక్కాడితేకానీ డొక్కాడని జీవితాలు ఆటో కార్మికులవి. రోజంతా ఆటో నడిపితే తప్ప పూటగడవని పరిస్థితి. అత్యవసరమై రోజువారీ వడ్డీకి అప్పు తెచ్చుకుని.. అది తీర్చడానికి రాత్రింబవళ్లు పనిచేయాల్సి వస్తుంది. ఆటో కార్మికుల వెతలు చూసి చలించిన మంత్రి హరీశ్‌రావు తన ఇంటిని బ్యాంకులో తాకట్టుపెట్టి ఆటో కార్మికుల కోసం కోఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆటో కార్మికులు అప్పులు చేయొద్దని, అత్మవిశ్వాసంతో బతకాలని ధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన కార్మికుడు పట్టణానికి చెందిన పిడిశెట్టి దుర్గయ్య మరణించగా.. గురువారం ఆయన కుటుంబానికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్‌ చెక్‌ను అందజేశారు. సిద్దిపేటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగ్యకు ఇంటి తాళంచెవిని, దుర్గయ్య కుటుంబానికి చెక్కును అందజేశారు. తన పుట్టినరోజున రెండు కుటుంబాలకు అండగా నిలవడం గొప్ప సంతృప్తినిచ్చిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-04T05:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising