ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా ప్రజలకునూతన సంవత్సర శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2022-01-01T03:55:25+05:30

కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 31 : కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్‌ గారి నాయకత్వంలో 2021లో రాష్ట్రం అన్నీ రంగాల్లో పురోగతి సాదించచినట్లు, 2022లో కూడా అదే స్ఫూర్తితో పురోభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు. గతేడాదంతా సుఖసంతోషాలతో గడిచినట్లే, ఈ ఏడాది మీ కుటుంబాల్లో, ఆనందాలు విలసిల్లాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేడుకలు కరోనా నిబంధనల ప్రకారం జరుపుకోవాలని సూచించారు. 


శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

హుస్నాబాద్‌, డిసెంబరు 31 : హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలను శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రెండేళ్లుగా ప్రజలు అనేక రకాలుగా కరోనాతో ఇబ్బందిపడ్డారని, ప్రస్తుతం ఒమైక్రాన్‌ విస్తరిస్తోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2022వ సంవత్సరం ప్రతీ ఇంటికి ఆనందోత్సాహాలను తీసుకురావాలని కోరుకున్నారు. 


Updated Date - 2022-01-01T03:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising