ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూల్‌డ్రింక్స్‌ వ్యాపారం పేరిట గుట్కా రవాణా

ABN, First Publish Date - 2021-04-19T05:44:23+05:30

కూల్‌డ్రింక్స్‌ వ్యాపారం పేరుతో నిషేధిత గుట్కాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్చారం, ఏప్రిల్‌ 18: కూల్‌డ్రింక్స్‌ వ్యాపారం పేరుతో నిషేధిత గుట్కాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మెదక్‌ ఎస్పీ చందనాదీప్తి తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన చరాక్‌పల్లి నవీన్‌కుమార్‌ తన ఆటోలో కూల్‌డ్రింక్స్‌ వ్యాపారం పేరుతో గుట్కాలను అక్రమంగా తరలిస్తున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది వెళ్లి పోతన్‌శెట్టిపల్లి చౌరస్తా వద్ద పట్టుకున్నారు. ఆటోలో మొత్తం రూ.1,89,610 విలువగల గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నవీన్‌కుమార్‌పై కేసు నమోదు చేసి, ఆటోను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటిపై సమాచారం తెలిస్తే డయల్‌ 100కు లేదా 7330671900 నంబరుకు వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించాలని కోరారు. తనిఖీల్లో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సీఐ మురళికుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T05:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising