ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యతా లోపంతో కంకర తేలుతున్న రోడ్లు

ABN, First Publish Date - 2021-07-09T04:41:55+05:30

నాణ్యత లోపించడంతో హుస్నాబాద్‌ పట్టణంలో నిర్మించిన రోడ్లు కంకర తేలుతూ, గుంతలమయంగా మారుతున్నాయి.

హుస్నాబాద్‌ పట్టణంలో కంకర తేలిన రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ.కోట్లాది నిధులు దుర్వినియోగం

 పర్యవేక్షణా లోపమే కారణం

 ఇబ్బందులు పడుతున్న హుస్నాబాద్‌ మునిసిపాలిటీ ప్రజలు


హుస్నాబాద్‌, జూలై 8: నాణ్యత లోపించడంతో హుస్నాబాద్‌ పట్టణంలో నిర్మించిన రోడ్లు కంకర తేలుతూ, గుంతలమయంగా మారుతున్నాయి. నిర్మించి నెలలు గడువక ముందే ప్రజలకు ఇబ్బందులు తెస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులే బినామీ కాంట్రాక్లర్లుగా మారడంతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. పట్టణంలో నిర్మించిన దాదాపు 70 శాతం సీసీ రోడ్లు కంకర తేలుతున్నాయి. హుస్నాబాద్‌ మునిసిపాలిటీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు టీయూఎ్‌ఫఐడీసీ నిధుల కింద రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ఇవే కాకుండా ప్లాన్‌గ్రాంట్‌ కింద రూ.5 కోట్లు మంజూరయ్యాయి. ప్లాన్‌ గ్రాంట్‌లో 25 పనులు చేపట్టగా ఇందులో మురికి కాలువలు, సీసీ రోడ్లు ఉన్నాయి. ఇందులో 23 పనులు పూర్తి చేశారు. గత పాలకవర్గంలో కొన్ని పనులు జరుగగా ఇప్పటికీ కొన్ని జరుగుతున్నాయి. సీసీ రోడ్లను నిర్మించి ఆరు నెలలు గడవక ముందే కంకర తేలి గుంతల మయంగా మారాయి. సరైన వాటర్‌ క్యూరింగ్‌, సమపాళ్ళలో ఇసుక, కంకర వినియోగించకపోవడంతో సిమెంట్‌ బిచ్చలుబిచ్చలుగా లేస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే నాసిరకంగా నిర్మాణాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీ ఏఈ ఇన్‌చార్జిగా ఉండి వారానికి రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతుండడంతో పనుల పర్యవేక్షణ లేకుండా పోయింది. 


 

Updated Date - 2021-07-09T04:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising