ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-07-30T04:15:19+05:30

పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని, దళితబంధును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రేషన్‌కార్డుల అందజేత

రాయికోడ్‌/మునిపల్లి/రామచంద్రాపురం/కంది, జూలై 29 : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని, దళితబంధును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. గురువారం రాయికోడ్‌లో రైతువేదికను ప్రారంభించి, రైతుబీమా, ఆహార భద్రతకార్డులు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి నరసింహారావు, జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్‌, ఏడీఏ హరిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బస్వరాజ్‌పాటిల్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ చేవెళ్ల విఠల్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అలాగే మునిపల్లి మండలం కంకోల్‌లోని ఫంక్షన్‌హాల్‌లో ఆహార భద్రతకార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీపీ శైలజ శివశంకర్‌, జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్‌, సర్పంచ్‌ విశ్వనాథం, నాయకులు పాల్గొన్నారు. అలాగే రామచంద్రాపురం మండలంలోని 95 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను, నూతన రేషన్‌కార్డులను శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బి.పుష్పనగేష్‌, వి.సింధూఆదర్శరెడ్డి, కుమార్‌యాదవ్‌, తెల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెపల్లి లలితాసోమిరెడ్డి, కౌన్సిలర్లు ఒగ్గు సుచరితకొమురయ్య, పట్లోళ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ శివకుమార్‌, డీటీ విశ్వేశ్వర్‌, ఆర్‌ఐ సందీ్‌పకుమార్‌, వీఆర్‌వో రాజమల్లేశం పాల్గొన్నారు. కంది తహసీల్దార్‌ సతీ్‌షకుమార్‌ ఆదేశాల మేరకు కంది మండలంలోని చిమ్నాపూర్‌లో ఆరుగురు లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్‌కార్డులను లబ్ధిదారులకు సర్పంచ్‌ రుద్రారం ప్రమీలాప్రకాష్‌ అందజేశారు.

Updated Date - 2021-07-30T04:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising