ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2021-09-19T04:07:16+05:30

మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

తోటపల్లి రిజర్వాయర్‌ వద్ద మంత్రి తలసాని సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న రసమయి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ 


బెజ్జంకి, సెప్టెంబరు 18: మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని తోటపల్లి గ్రామంలో ఆన్‌లైన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 20న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేపపిల్లలను వదలనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ రిజర్వాయర్‌ వద్ద మంత్రి సభా ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మండల వ్యాప్తంగా 13లక్షల పైచిలుకు చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలేందుకు మత్స్యకారులకు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్‌లో మూడు లక్షల పైచిలుకు చేపపిల్లలు, రొయ్య పిల్లలను మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ వదిలేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మంత్రి సభను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, సర్పంచ్‌ నర్సింగరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి మధుసూదన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజయ్య, వైస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, ఎంపీడీవో రాఘవేందర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు సంజీవరెడ్డి, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ మహిపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, లక్ష్మణ్‌, తిరుపతి పాల్గొన్నారు. కాగా, మండలంలోని వడ్లూరు గ్రామానికి చెందిన మిట్టపల్లి రాజేశంకు రూ.2లక్షల ఎల్‌వోసీని ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ మహిపాల్‌రెడ్డి, లక్ష్మణ్‌, స్వామి, శ్రీనివాస్‌, మోహన్‌ పాల్గొన్నారు.


 

Updated Date - 2021-09-19T04:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising