ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా బోనాలు

ABN, First Publish Date - 2021-07-28T04:34:08+05:30

జోగిపేటలోని తూర్పుగౌని ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో, అందోలులోని పోచమ్మ తల్లికి, రొయ్యల గూడెం కాలనీలో పోచమ్మవారికి, జోగిపేటలోని బుడగ జంగాల కాలనీలో పోచమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారు.

ఏడుపాయలలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంబీపూర్‌ రాజు, నవీన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హాజరైన ఎమ్మెల్యే  క్రాంతికిరణ్‌, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌

జోగిపేట, జూలై 27: జోగిపేటలోని తూర్పుగౌని ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో, అందోలులోని పోచమ్మ తల్లికి, రొయ్యల గూడెం కాలనీలో పోచమ్మవారికి, జోగిపేటలోని బుడగ జంగాల కాలనీలో పోచమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారు.  ఆయా ఆలయాల వద్ద ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్‌ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  రొయ్య ల గూడెంలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ పోతురాజులతో కలిసి డప్పు కళాకారుల దరువులకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ నృత్యం చేశారు. మెడలో పోతురాజులు ఇచ్చిన ఛర్నాకోలాను,  అభిమానులు ఇచ్చిన కత్తిని ప్రదర్శించారు.


జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

గుమ్మడిదల: గుమ్మడిదలలో మంగళవారం  ఎల్లమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.  ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించు కొని మొక్కలు తీర్చుకొన్నారు. రైతులు ఎండ్ల బండ్లను అలకరించి అలయం చుటూ ప్రదర్శించారు. ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 


హరీశ్‌రావును ఆహ్వానించిన మున్సిపల్‌ చైర్మన్‌

తూప్రాన్‌: తూప్రాన్‌లోని ఉజ్జయిని మహాంకాళి ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రి హరీశ్‌రావును మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ ఆహ్వానించారు. ఆగస్టు ఒకటి నుంచి బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 


ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకున్న కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

పాపన్నపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత అమ్మవారిని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, నవీన్‌రావు దర్శించుకున్నారు. మంగళవారం వారు ఏడుపాయలకు చేరుకోగా ఈవో సార శ్రీనివాస్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు వన దుర్గామాతనుదర్శించుకుని ప్రత్యేక అర్చన, పూజలు నిర్వహించారు. వీరిని ఈవో శ్రీనివాస్‌ శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.  

Updated Date - 2021-07-28T04:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising