ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొల్లకుర్మల గొంతు కోసిన సీఎం కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-02-25T05:29:14+05:30

గొల్లకుర్మలను సీఎం కేసీఆర్‌ నమ్మించి గొంతు కోశారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్‌గౌడ్‌ విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీకాంత్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 26న మెదక్‌ కలెక్టరేట్‌ ముట్టడి

 బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్‌గౌడ్‌


సంగారెడ్డి రూరల్‌, ఫిబ్రవరి 24: గొల్లకుర్మలను సీఎం కేసీఆర్‌ నమ్మించి గొంతు కోశారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్‌గౌడ్‌ విమర్శించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని ఓ హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఓబీసీలను ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వినియోగించుకుంటున్నదని, గొల్లకుర్మలకు గొర్రెల యూనిట్‌లు ఇస్తామని 28 వేల కుటుంబాల నుంచి రూ.9వేల కోట్లు కట్టించుకుని పంపిణీ చేయలేదని విమర్శించారు. గొల్లకుర్మల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26న మెదక్‌ కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు వెల్లడించారు. గొల్లకుర్మలు పాల్గొని విజయవంతం చేయాలని శ్రీకాంత్‌గౌడ్‌ కోరారు. సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సురేందర్‌, జిల్లా ఇన్‌చార్జి, ప్రధాన కార్యదర్శి శేఖర్‌, మహేందర్‌, సుధీర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్‌, నర్సింగ్‌గౌడ్‌, రవియాదవ్‌, నరేందర్‌, వినోద్‌, ఈశ్వరయ్య, శంకర్‌, సందీప్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T05:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising