ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగపుత్రులు ఆర్థికంగా వృద్ధి చెందాలి

ABN, First Publish Date - 2021-10-23T04:31:01+05:30

రాష్ట్రంలో గంగపుత్రులు, ముదిరాజ్‌లు ఆర్థికంగా వృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు.

ములుగు చెరువులో చేపపిల్లలను వదులుతున్న ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి


వర్గల్‌, అక్టోబరు 22: రాష్ట్రంలో గంగపుత్రులు, ముదిరాజ్‌లు ఆర్థికంగా వృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. శుక్రవారం వర్గల్‌ మండల పరిధిలోని నాచారం, మజీద్‌పల్లి, వేలూర్‌, సీతరాంపల్లి గ్రామాల్లోని చెరువుల్లో గంగపుత్రులు, ముదిరాజ్‌లతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో 600 చెరువుల్లో 1.06 కోట్ల చేపపిల్లలను వదిలినట్లు వెల్లడించారు. నాచారం హల్దీవాగులో 80వేలు, వేలూర్‌, మజీద్‌పల్లి, అనంతగిరిపల్లి, సీతారాంపల్లి పరిసర ప్రాంతంలో 5.25 లక్షల చేప పిల్లలను వదిలినట్లు చెప్పారు. అనంతరం సీతారాంపల్లిలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలుయాదవ్‌, ఎంపీపీ జాలిగామ లతరమేశ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్‌, సర్పంచ్‌లు శ్రీనివా్‌సరెడ్డి, పాపిరెడ్డి, శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగరాజు, మాజీ సర్పంచ్‌ యాదగిరిగౌడ్‌, నాయకులు వెంకటేశ్‌, హర్షద్‌ పాల్గొన్నారు.


ములుగు మండలంలో


ములుగు: కొక్కొండ, సింగన్నగూడ, కొత్తూరు, నర్సాపూర్‌, ములుగు గ్రామాల్లో 4లక్షల64 వేల చేపపిల్లలను వదిలినట్లు ప్రతా్‌పరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్‌, కో ఆప్షన్‌సభ్యుడు సలీం, మైనార్టీ నేత జుబేర్‌, ఎంపీటీసీలు ప్రవీణ్‌, భూచక్రం, నాగేష్‌, కనకయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-10-23T04:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising