ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమురవెల్లి టికెట్ల రీ సైక్లింగ్‌ కేసులో నలుగురి అరెస్టు

ABN, First Publish Date - 2021-01-18T05:48:57+05:30

కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రత్యేక దర్శన టి కెట్ల రీసైక్లింగ్‌కు పాల్పడిన ఉదంతంలో నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించినట్టు హుస్నాబాద్‌ ఏసీపీ సందెపోగు మహేందర్‌ వెల్లడించారు.

విలేకరుల సమావేశంలో ఏసీపీ మహేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, జనవరి 17: కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రత్యేక దర్శన టి కెట్ల రీసైక్లింగ్‌కు పాల్పడిన ఉదంతంలో నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించినట్టు హుస్నాబాద్‌ ఏసీపీ సందెపోగు మహేందర్‌ వెల్లడించారు. అరెస్టయినవారిలో సిద్దిపేట హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులతో పాటు ఇద్దరు మల్లన్న ఆలయ తాత్కాలిక సిబ్బంది ఉన్నట్టు తెలియజేశారు. ఆదివారం రాత్రి కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. మల్లన్న జాతర సందర్భంగా సిద్దిపేట హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు సిబ్బంది ఉచితంగా సేవలందిస్తున్న క్రమంలో ఆలయాఽధికారులు వారితో ప్రత్యేక దర్శన టికెట్లను జారీ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా పట్నంవారం సందర్భంగా బ్యాంకు ఉద్యోగులైన సిద్దిపేటకు చెందిన కొండపర్తి సతీష్‌, పెద్దకోడూరుకు చెందిన తడకపల్లి మహేశ్‌ రాజగోపుర ఆవరణలోని రూ.150 ప్రత్యేక దర్శన బుకింగ్‌ కౌంటర్‌లో రాత్రి 8 గంటల నుంచి భక్తులకు టికెట్లను విక్రయిస్తున్నారు. కౌంటర్‌లో విక్రయించిన టికెట్లను చించి దర్శనానికి అనుమతించేందుకు ఆలయాధికారులు కొమురవెల్లి గ్రామానికి చెందిన గజ్జె వెంకటేశ్‌, మ్యాకల నిఖిల్‌లను తాత్కాలికంగా నియమించారు. వీరందరూ కుమ్మక్కై భక్తుల నుంచి తీసుకున్న టికెట్లను చించివేయకుండా.. తిరిగి కౌంటర్‌ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు భక్తులు ఈవో బాలాజీ దృష్టికి తెచ్చారు. దీంతో శనివారం రాత్రి ఈవో తనిఖీలు నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసలు బ్యాంకు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారించగా టికెట్లను తిరిగి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.8,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈవో బాలాజీ  ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసులు నమోదుచేసి జనగామ మేజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టగా రిమాండ్‌ విధించినట్లు వివరించారు. సమావేశంలో చేర్యాల సీఐ భీంరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, కొమురవెల్లి ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-18T05:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising