ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విహారయాత్రకు..

ABN, First Publish Date - 2021-12-01T04:42:18+05:30

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి.

మెదక్‌ నుంచి కుటుంబసభ్యులతో కలిసి క్యాంపునకు బయలుదేరిన టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుటుంబసభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల టూర్‌

మెదక్‌ జిల్లాలో మొదలైన క్యాంపులు

హైదరాబాద్‌ మీదుగా బెంగుళూరు, గోవా వెళ్లేందుకు ప్లాన్‌

సంగారెడ్డి, సిద్దిపేట ప్రజాప్రతినిధులు విమానంలో ఢిల్లీకి


ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌/సంగారెడ్డి, నవంబరు 30: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రజాప్రతినిధులందరినీ శిబిరాలకు తరలించే పనిలో టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు బిజీ అయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి గులాబీ పార్టీకి చెందిన 777 మంది ప్రజాప్రతినిధులను టూర్‌కు తీసుకెళ్లేందుకు అన్నిసౌకర్యాలను సిద్ధం చేశారు. మంగళవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బస్సుల్లో బయలుదేరారు. ప్రజాప్రతినిధి ఒక్కరే కాకుండా కుటుంబసభ్యులు కూడా టూర్‌కు తరలివెళ్లారు. మొదట మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వాహనాలు శివ్వంపేట మండలం చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నాయి. అక్కడ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అయితే చాకరిమెట్లకు చేరుకున్న ఓటర్లను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి కలిసి వారితో మాట్లాడారు. నర్సాపూర్‌ మీదుగా హైదరాబాద్‌ బయలుదేరి అక్కడి నుంచి బెంగళూరు, మైసూరు, గోవాకు వెళ్లే విధంగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. వీరంతా డిసెంబరు 8 వరకు శిబిరంలోనే ఉంటారు. 9న హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. 10న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఏ విధంగా ఓటు వేయాలో అవగాహన కల్పిస్తారు. ఈ క్యాంపులో పదిరోజుల పాటు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు ఎంజాయ్‌ చేసేందుకు అవసరమైన ఖర్చు మొత్తాన్ని పార్టీ భరించనుంది. ఇక సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు చెందిన ఓటర్లు డిసెంబరు ఒకటి క్యాంపునకు బయలు దేరనున్నారు. ఈ రెండు జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్తున్నారు. వీరందరూ కుటుంబసభ్యులతో కలిసి విమానంలో వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈమేరకు మంగళవారం మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో వ్యవహరించి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ యాదవరెడ్డిని గెలిపించాలని కోరారు. ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవచ్చని, తమ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని హరీశ్‌రావు ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చినట్టు తెలిసింది.

ప్యాకేజీ తెలియక అయోమయం!

టూర్లకైతే తీసుకెళుతున్నప్పటికీ మొత్తం మీద ఓటేసేందుకు తమకు ఎంత ఇవ్వాలని నిర్ణయించారో తెలియడం లేదని పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా గెలిచినప్పటి నుంచి పనులు ఏమీ పెద్దగా జరగలేదని, కొన్ని చోట్ల పనులు చేసినా బిల్లుల చెల్లింపులో జాప్యం నెలకొన్నదని వారు తెలిపారు. తాము ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఈ ఎన్నికలతో తమను ఆదుకుంటారన్న భావనతో ఉన్నామని పలువురు తెలిపారు. 

రూ.ఐదు లక్షల చొప్పున ఇవ్వాలి!

మంత్రి హరీశ్‌రావు పర్యటనకు ఒకరోజు ముందు సోమవారం సంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ఓ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రతినిధులైతే ఏకంగా తమకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇప్పించేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. అయితే ఈ అంశం గురించి మంత్రి హరీశ్‌రావు సమావేశంలో ప్రస్తావించవద్దని ఎమ్మెల్యే సూచించినట్టు తెలిసింది. అన్ని విషయాలు తాను చూసుకుంటానని, అన్ని నియోజకవర్గాలలో మాదిరిగా మీకు కూడా అన్ని రకాల సహాయం అందేలా చూసే బాధ్యత తనదని ఓ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. దాంతో మంగళవారం నాటి సమావేశంలో మంత్రి హరీశ్‌రావు చెప్పిన మాటలు విని, కిమ్మనకుండా ఉండాల్సి వచ్చిందని స్థానిక సంస్థల ప్రతినిధులు పలువురు వాపోయారు. 

ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఖర్చు

ఈ ఎన్నికల కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున టీఆర్‌ఎస్‌ ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది! శాసనమండలి స్థానిక సంస్థల ఉమ్మడి మెదక్‌ జిల్లా నియోజకవర్గంలో 1,027 మంది ఓటర్లుండగా, వీరిలో టీఆర్‌ఎ్‌సకు 700 పైచీలుకు ఓటర్లు ఉన్నారు. వీరి ఢిల్లీ విమాన ప్రయాణంతో పాటు ఎనిమిది రోజుల పాటు జరిపే విహారయాత్రల రవాణా ఖర్చు ఒక్కొక్కరికి ఒక్కో లక్ష రూపాయల చొప్పున ఖర్చవుతున్నట్టు తెలిసింది. ప్రతినిధులతో పాటు భార్య, పిల్లలను కూడా తీసుకెళ్తున్నట్లు సమాచారం. యాత్రలో భాగంగా ప్రతినిధులు ఏమైనా కొనుగోలు చేసే వస్తువుల కోసం ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఇక పదో తేదీన జరిగే పోలింగ్‌కు ఒక రోజు ముందు నియోకవర్గాల వారీగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మాక్‌ పోలింగ్‌ జరిపించి, ఒక్కో ప్రతినిధికి లక్ష రూపాయల కవర్‌ను ఇవ్వాలని నిర్ణయం జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.



Updated Date - 2021-12-01T04:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising