ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెదసాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన

ABN, First Publish Date - 2021-04-21T05:12:46+05:30

మండలంలోని పెద్దగుండవెళ్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ విజయ్‌, డాక్టర్‌ పల్లవి వెదసాగు పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబ్బాక, ఏప్రిల్‌ 20: మండలంలోని పెద్దగుండవెళ్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ విజయ్‌, డాక్టర్‌ పల్లవి వెదసాగు పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించారు. ఎకరాకు 8 కిలోల వరివిత్తనాలు ఒకరోజు మండేకట్టి కొద్దిగా ముక్కు వచ్చిన తర్వాత దమ్ము చేసి పలుచగా నీరున్న పొలంలో జల్లుకోవాలన్నారు. వారం వరకు అతి తక్కువ స్థాయిలో నీరుంచి, ఆ తర్వాత 2 సెంటి మీటర్ల వరకు నీరు పెట్టాలన్నారు. కలుపు సమస్యను అధిగమించుటకు విత్తిన వారంలో ప్రేతిలాక్లోర్‌ కలుపు మందును, 25రోజులకు బిస్పారమిక్‌ సోడియం కలుపు మందును 80 ఎంఎల్‌ 10 కిలోల ఇసుకలో కలిపి జల్లుకోవాలన్నారు. వానకాలంలో వెదసాగు చేసే విధంగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాధికారి ప్రవీణ్‌, సర్పంచ్‌ రాజిరెడ్డి, ఎంపీటీసీ రవి, రైతు కోఆర్టినేటర్‌ రాఘవరెడ్డి పాల్గొన్నారు.


 

Updated Date - 2021-04-21T05:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising