ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు ఇబ్బందులు పడొద్దు

ABN, First Publish Date - 2021-06-19T05:55:10+05:30

ఈ ఏడాది చెరకు రైతులు ఇబ్బందులు పడకూడదని ట్రైడెంట్‌ కర్మాగారం యాజమాన్యాన్ని ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆదేశించారు

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ బీబీపాటిల్‌, మాణిక్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నవంబరు 15 నుంచి క్రషింగ్‌ ప్రారంభించాలి

 బిల్లుల చెల్లింపులో జాప్యం తగదు

 జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు


జహీరాబాద్‌, జూన్‌ 18: ఈ ఏడాది చెరకు రైతులు ఇబ్బందులు పడకూడదని ట్రైడెంట్‌ కర్మాగారం యాజమాన్యాన్ని ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంపీ బీబీపాటిల్‌ కార్యాలయంలో శుక్రవారం ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారం యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడారు. గతంలో మాదిరి ఈ ఏడాది రైతులను ఇబ్బందులకు గురిచేయకూడదని సకాలంలో బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కర్మాగార యాజమాన్య అధికారులను వారు కోరారు. నవంబర్‌ 15లోగా క్రషింగ్‌ మొదలుపెట్టాలని యాజామాన్యానికి సూచించారు. మార్కెట్‌ ధరలను దృష్టిలో ఉంచుకుని రైతులకు మద్దతు ధరను ఇవ్వాలని చెప్పారు. కర్మాగారంలోని కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు అందజేసి తిరిగి పనుల్లోకి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్‌ షుగర్‌ కేన్‌ కమిషనర్‌ రాఘవేంద్రరావు, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌, ట్రైడెంట్‌ షుగర్స్‌ ఎండీ రామ్‌నాథ్‌రావు, వైస్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ, చక్కెరశాఖ అధికారి రవీందర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising