ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ప్రకటనలతో రైతుల అయోమయం

ABN, First Publish Date - 2021-12-03T04:58:14+05:30

కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ నాయకులు చేసే ప్రకటనలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు.

మద్దూరులో ప్లకార్డులతో టీఆర్‌ఎస్‌ నాయకుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ నాయకుల నిరసన 


మద్దూరు, డిసెంబరు 2: కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ నాయకులు చేసే ప్రకటనలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. రాతపూర్వకంగా తెలియజేయాలని కోరుతూ గురువారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దూరులో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు మేక సంతోష్‌ మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రైతులను తప్పుదోవ పట్టించకుండా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా వడ్లు కొంటామని స్పష్టమైన వైఖరిని తెలియజేసేలా కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వడ్లును కొనాల్సిందేనన్నారు. కేంద్రం వడ్లు కొనేవరకు ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ జనార్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ సమ్మయ్య, నాయకులు మల్లేశం, మల్లేశం, చంద్రమౌళి, నర్సింహులు పాల్గొన్నారు. 


బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం 


నంగునూరు, డిసెంబరు 2: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాగుల సారయ్య అన్నారు. గురువారం సిద్ధన్నపేట మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజలపై భారం వేస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సంగు పురెందర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నాగేంద్రం, నంగునూరు సహకార సంఘం చైర్మన్‌ రమే్‌షగౌడ్‌, రైతుబంధు అధ్యక్షుడు కిష్టారెడ్డి, మార్కెట్‌ కమిటీ సభ్యులు రేకులపల్లి వెంకట్‌రెడ్డి, నాయకులు డాకురి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


 

Updated Date - 2021-12-03T04:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising