ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలపై ప్రతిఒక్కరూ ఆసక్తి పెంపొందించుకోవాలి

ABN, First Publish Date - 2021-01-25T05:52:10+05:30

క్రీడలపై ప్రతిఒక్కరూ ఆసక్తి పెంపొందించుకోవాలని సీడీసీ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

దౌల్తాబాద్‌లో కబడ్డీ క్రీడలను ప్రారంభిస్తున్న ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీడీసీ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

హత్నూర, జనవరి 24 : క్రీడలపై ప్రతిఒక్కరూ ఆసక్తి పెంపొందించుకోవాలని సీడీసీ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దౌల్తాబాద్‌లో స్వర్గీయ మల్లారెడ్డి స్మారక కబడ్డీ టోర్నమెంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ మల్లారెడ్డిగారి దుర్గేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, రాములు, పొట్లచెర్వు నరేందర్‌, మహిపాల్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.

ఝరాసంగం : శరీర దారుఢ్యతకు క్రీడలు దోహదపడతాయని బీజేపీ జహీరాబాద్‌ ఇన్‌చార్జి జంగం గోపి అన్నారు. ఆదివారం మండలంలోని మాచూనూర్‌ గ్రామంలో కొనసాగుతున్న గోపన్న ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. ప్రథమ బహుమతి పొందిన బోప్పన్‌పల్లి గ్రామానికి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి పొందిన సిద్ధాపూర్‌కు రూ.25 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాండు, అనిల్‌ పాల్గొన్నారు.

కోహీర్‌ : కోహీర్‌ మండలంలోని పిచేర్యాగడి గ్రామంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో ప్రథమ బహుమతి పొందిన బన్ని లెనిన్‌ జట్టుకు సర్పంచ్‌ జే.రవికిరణ్‌ రూ.25 వేల నగదు, కప్‌ అందజేశారు. అలాగే ద్వితీయ బహుమతి పొందిన లిటిల్‌ స్టార్‌ జట్టుకు రూ.10 వేల నగదు అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ జేటయ్య, రాజనేలి సర్పంచ్‌ ఆనంద్‌, ముఖ్య నాయకులు నవీన్‌కుమార్‌, వీరారెడ్డి, సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

రేపటి నుంచి జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌

వట్‌పల్లి, జనవరి 24 : ఈ నెల 26 నుంచి వట్‌పల్లిలో జిల్లాస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లొంకల నర్సింగ్‌రావు స్మారకార్థం నిర్వహించే టోర్నీలో ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. 

Updated Date - 2021-01-25T05:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising