ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎత్తిపోతల పంపులను పరిశీలించిన ఇంజనీర్లు

ABN, First Publish Date - 2021-04-09T06:41:56+05:30

ఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కిమానాయక్‌ ఆధ్వర్యంలో ఇంజనీర్లు తూప్రాన్‌ - కిష్టాపూర్‌ రోడ్డులోని హల్దీవాగు చెక్‌డ్యాం వద్దగల ఎత్తిపోతల పంపులను గురువారం పరిశీలించారు.

తూప్రాన్‌ పెద్ద చెరువు ఎత్తిపోతల పంపులను పరిశీలిస్తున్నఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మరమ్మతులకు ప్రతిపాదనలు 

తూప్రాన్‌, ఏప్రిల్‌ 8: ఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కిమానాయక్‌ ఆధ్వర్యంలో ఇంజనీర్లు తూప్రాన్‌ - కిష్టాపూర్‌ రోడ్డులోని హల్దీవాగు చెక్‌డ్యాం వద్దగల ఎత్తిపోతల పంపులను గురువారం పరిశీలించారు. తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి ఇటీవలే సీఎం కేసీఆర్‌కు పంపుల మరమ్మతు గురించి విన్నవించారు. దీంతో తూప్రాన్‌ ఎత్తిపోతల పంపులను పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇంజనీర్లను ఆదేశించగా గురువారం వారు పరిశీలించారు. మూడు, నాలుగు రోజుల్లో తూప్రాన్‌ సమీపంలోని హల్దీవాగులోకి కాళేశ్వరం జలాలు రానుండటంతో ఎత్తిపోతల పథకం పంపుల మరమ్మతుపై దృష్టి సారించారు. ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించి రెండు భారీ మోటార్లు, లీకేజీలు మరమ్మతు చేయడానికి నిర్ధేశించారు. ఒకటి, రెండు రోజుల్లో మరమ్మతులు చేయాలని ఎస్‌ఈ సూచించినట్లు సమాచారం. ఇంజనీరింగ్‌ అధికారులతో తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, మనోహరాబాద్‌ ఎంపీపీ వైస్‌ ప్రెసిడెంట్‌ విఠల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-09T06:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising