మెదక్‌లో ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ ఏర్పాటుకు కృషి
ABN, First Publish Date - 2021-06-12T05:10:41+05:30
మెదక్ పట్టణంలో ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి
పట్టణంలో రూ.60లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మెదక్/ మెదక్ మున్సిపాలిటీ, జూన్ 11: మెదక్ పట్టణంలో ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం మెదక్‌లోని పలు వార్డుల్లో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాలకు ఆమె శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన 9 వార్డుల్లో అభివృద్ధిపనులకు భూమిపూజ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందడం కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతీ నెల మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయి స్తున్నామన్నారు. దీంతో వెనకబడిన కాలనీలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. పల్లెప్రగతిలో భాగంగా డంపు యార్డులు, వైకుంఠధామాలు, వన నర్సరీలు తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. మెదక్ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మెయిన్ రోడ్డును వెడల్పుతో పాటు రామదాస్ చౌరస్తాలో సిగ్నల్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే రాందాస్ చౌరస్తాలో ఆగి చమాన్ పనులను పరిశీలించారు. చమాన్‌ను మూడు అడుగులకు తగ్గించాలని, సిగ్నల్ లైటింగ్ ఏర్పాటు పర్యవేక్షించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. పట్ణణంలో నిర్మిస్తున్న మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని, వేయి డబుల్ బెడ్‌రూం ఇళ్లను త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ వైస్ చైర్‌పర్సన్ లావణ్యారెడ్డి, వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, నాయకులు రాగి అశోక్, మేడి మధుసూదన్‌రావు, ఆరెళ్ల గాయిత్రి, వంజరి జయరాజ్, అవారి శేఖర్, మాడిశెట్టి సుమన్, లింగారెడ్డి, ఆర్‌కె శ్రీనివాస్, కాసపురం మధు, అంజద్‌అలీ, శంషున్నిసాబేగం, బీమరి కిషోర్, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, కృష్ణ, కొట్టాల విశ్వం, వేదవతి రాములు ఉన్నారు.
గ్రామాల్లో పారిశుధ్యంపై తనిఖీ చేస్తా
మెదక్ రూరల్, జూన్ 11: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కొన్ని గ్రామాలు ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే అధికారులే బాధ్యత వహించాల్సివస్తుందని హెచ్చరించారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు వివరించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్ వేయాని, భగీరథ నీరు సక్రమంగా అందేలా చూడాలని చెప్పారు. సమీక్షలో డీఆర్డీవో శ్రీనివా్‌సతో పాటు ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-12T05:10:41+05:30 IST