ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామస్థాయిలో మెరుగైన వైద్యానికి కృషి

ABN, First Publish Date - 2021-01-25T05:49:31+05:30

గ్రామీణ ప్రజావైద్యంలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాల కల్పన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లాలోని ఒక్కో సబ్‌ సెంటర్‌కు రూ.16 లక్షలు మంజూరు

 ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 


సిద్దిపేట సిటీ, జనవరి 24: గ్రామీణ ప్రజావైద్యంలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాల కల్పన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 48 ఉప ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మించేందుకు రూ.7.68 కోట్లు మంజూరు చేసిందని ప్రకటనలో తెలిపారు. ఒక్కో సబ్‌ సెంటర్‌కు రూ.16 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) నిధులతో భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేందుకు మొదటి విడతగా రూ.2.30 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించిందన్నారు. 


కేసీఆర్‌ నగర్‌కు బస్తీ దవాఖానా..


సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్‌ నగర్‌ డబుల్‌ బెడ్‌ రూంల గృహ సముదాయానికి బస్తీ దవాఖాన మంజూరయ్యిందని, భవన నిర్మాణానికి రూ.16 లక్షలను అధికారులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్‌ నగర్‌కు బస్తీ దవాఖానను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-01-25T05:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising