ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధునిక పద్ధతుల్లో సులువుగా మల్బరీ సాగు

ABN, First Publish Date - 2021-06-08T05:04:00+05:30

గతంలో మల్బరీసాగు కొంత ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం ఆధునిక పద్ధతులతో చాలా సులువుగా మారిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. డిమాండ్‌

చంద్లాపూర్‌లో మల్బరీ మొక్క నాటి నీరుపోస్తున్న మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దేశంలోనే వరి ఎక్కువగా పండించిన రాష్ట్రంగా తెలంగాణ 

 ఆయిల్‌పామ్‌ తోటలకు సిద్దిపేట జిల్లా అనుకూలం

 కలెక్టర్‌ జీతం కంటే రైతులు పండించిన పంటకే అధిక లాభాలు

 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు



చిన్నకోడూరు, జూన్‌ 7 : గతంలో మల్బరీసాగు కొంత ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం ఆధునిక పద్ధతులతో చాలా సులువుగా మారిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. డిమాండ్‌ ఉన్న పంటను పండిస్తే రైతులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్‌, మల్బరీ రంగాల్లో చాలా అవకాశాలున్నాయని చెప్పారు. సోమవారం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌లో జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మల్బరీ సాగును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అక్కడి వ్యవసాయ క్షేత్రంలో హరీశ్‌రావు మల్బరీ మొక్కను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం అధికంగా పండిదని సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సమైక్య రాష్ట్రం లో ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఇతర రాష్ర్టాలకు వలసలు పోయే పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి హమలీలు రాకపోతే మిల్లుల్లో మన ధాన్యం దిగే పరిస్థితి లేదన్నారు. మన రాష్ట్రంలో నాట్లు వేయడానికి ఆడవాళ్లు దొరకడం లేదని, ఇతర రాష్ట్రాల నుంచి మగవారు వచ్చి వరి నాట్లు వేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడి పౌలీ్ట్రల్లో పనికి కుదురుతున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనమని ఎఫ్‌సీఐ ద్వారా లేఖలు రాస్తుందని ఆయన మండిపడ్డారు. ఇంత కరోనా సంక్షోభంలో కూడా దేశంలోనే రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్న ఘనత మన తెలంగాణ ప్రభుత్వానిదేనని తెలియజేశారు. కాళేశ్వరం నీటితో సిద్దిపేట జిల్లా ఆయిల్‌పామ్‌ తోటలకు అనుకూలంగా మారిందన్నారు. 86 మంది రైతులతో 200 ఎకరాల్లో చంద్లాపూర్‌లో ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశామన్నారు. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ రూ.1 కోటి 22 లక్షల 62 వేలను రైతులకు విడుదల చేశామని తెలిపారు. దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల్లో సెరీకల్చర్‌ సాగు చేస్తుండగా మన రాష్ట్రంలో 12 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారని వివరించారు. మనకు చాలా అవకాశం ఉందని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. కలెక్టర్‌ జీతం కంటే రైతులు పండించిన పంటలకే అధిక లాభా లు వస్తున్నాయని, కలెక్టర్‌కు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఉంటుందని, కానీ రైతుకు ఉండదన్నారు. రైతులకు ఉత్పత్తి, ఆదాయం, ఆర్థిక పరిపుష్టి పెరగాలని, జీవనవిధానంలో మార్పు రావాలని, పదిమందికి సహాయం చేసే విధంగా ఎదగాలన్నదే నా తాపత్రయమన్నారు. రైతులు వరిలో వెద జల్లే సాగు పద్ధతిని అవలంభించాలన్నారు. అంతకుముందు మల్బరీ సాగు రైతులు తమ అనుభవాలను తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, టీఆర్‌ఎస్‌ రాష్ట్రకార్యదర్శి రాధాకృష్ణశర్మ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి రామలక్ష్మి, పట్టుపరిశ్రమశాఖ అఽధికారి ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ మాణిక్యరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, పీఏసీఏస్‌ చైర్మన్‌లు సదానందం, కనకరాజు, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్‌ వెంకటేశం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


బహిరంగ మార్కెట్‌లో పట్టు ఉత్పత్తికి గిరాకీ

పట్టుఉత్పత్తికి బహిరంగ మార్కెట్‌లో గిరాకీ ఉండడంతో రైతులు ఆదిశగా ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో పట్టు రైతులు ఐలయ్య, నర్సింహులు వ్యవసాయక్షేత్రాలను మంత్రి హరీశ్‌రావు సోమవారం సాయంత్రం పరిశీలించారు. సాగు, పట్టపురుగుల పెంపకంలో అవలంభిస్తున్న విధానాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పట్టు పురుగుల పెంపకంలో పట్టు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారని  అభినందించారు. మంత్రి వెంట రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్రకార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్‌, జిల్లా ఉద్యానవనశాఖ అధికారిరామలక్ష్మి, పట్టుపరిశ్రమశాఖ అధికారి ఇంద్రసేనా రెడ్డి, పాల్గొన్నారు.


 బ్లాక్‌ ఫంగస్‌ ఆపరేషన్‌ సక్సెస్‌

సిద్దిపేటటౌన్‌ : బ్లాక్‌ఫంగ్‌సతో బాధపడుతున్న వ్యక్తికి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆపరేషన్‌ చేసి విజయం సాధించారు. నెలక్రితం గౌస్‌మోహియోద్దిన్‌ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా చికిత్స పొంది డిశ్చార్జి అయ్యాడు. ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో వైద్యులు పరీక్షించి బ్లాక్‌ఫంగ్‌సగా నిర్ధారించారు. ప్రభుత్వాసుపత్రిలోని వైద్యుడు, ఈఎన్‌టీ ప్రొఫెసర్‌ నాగరాజు ఆధ్వర్యంలో ఆపరేషన్‌ చేశారు.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ ఆపరేషన్‌ను నిర్వహించిన వైద్యులకు, సిబ్బందిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. 

Updated Date - 2021-06-08T05:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising