ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర

ABN, First Publish Date - 2021-10-18T04:36:15+05:30

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 545 విగ్రహాలను ఏర్పాటు చేశారు.

దుద్దెడలో నిర్వహించిన దేవి శోభాయాత్రలో మహిళల కోలాటం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  సిద్దిపేట జిల్లాలో 155 విగ్రహాల నిమజ్జనం 


సిద్దిపేట రూరల్‌, అక్టోబరు 17: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 545 విగ్రహాలను ఏర్పాటు చేశారు. 320 విగ్రహాలను శనివారం నిమజ్జనం చేయగా.. ఆదివారం 155 విగ్రహాలను నిమజ్జనం చేశారు. చెరువుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువులో పట్టణ సమీప గ్రామాల నుంచి విగ్రహాలను తెచ్చి నిమజ్జనం చేస్తున్నారు. మున్సిపల్‌ శాఖ అధికారులు కోమటి చెరువు వద్ద క్రేన్‌లను ఏర్పాటు చేశారు. 


దుద్దెడలో గిరిజనుల గుస్సాడి నృత్యం


కొండపాక: కొండపాక మండలంలోని దుద్దెడలో చైతన్య యువ పరివారం ఆధ్వర్యంలో దుర్గాదేవి శోభాయాత్ర వైభవంగా జరిగింది. అదిలాబాద్‌ నుంచి వచ్చిన గిరిజన తెగ వారు చేసిన గుస్సాడి నృత్యం అలరించింది. అలాగే పూణే నుంచి బ్యాండ్‌ మేళాన్ని రప్పించారు. గ్రామంలోని 300మంది మహిళలు ఊరేగింపులో కోలాటం, దాండియా ఆడారు.

Updated Date - 2021-10-18T04:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising