ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యలోపంపై డీపీవో ఆగ్రహం

ABN, First Publish Date - 2021-10-30T04:18:12+05:30

హత్నూర మండల పరిధిలోని చింతల్‌చెర్వు, వడ్డెపల్లి గ్రామాలను సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌ మోహన్‌ శుక్రవారం సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీవో, 3 గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు నోటీసులు

హత్నూర, అక్టోబరు 29: హత్నూర మండల పరిధిలోని చింతల్‌చెర్వు, వడ్డెపల్లి గ్రామాలను సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌ మోహన్‌ శుక్రవారం సందర్శించారు. గ్రామాల్లోని పరిసరాలు, మురికి కాలువలు పరిశీలించారు. రోడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో పాటు మురుగు కాలవలో చెత్తాచెదారం పేరుకుపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గ్రామాల అభివృద్ధిపై పలు సలహాలు, సూచనలు చేసినా నిర్లక్ష్యం చేయడంపై సర్పంచులు, కార్యదర్శులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీపీవో హెచ్చరించారు. కాగా మండల పంచాయతీ అధికారి సువర్ణ, చింతల్‌చెర్వు, వడ్డెపల్లి, గుండ్లమాచునూర్‌ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో డీపీవో పేర్కొన్నారు.


Updated Date - 2021-10-30T04:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising