ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహనీయుల విగ్రహాలను పట్టించుకోరా..?

ABN, First Publish Date - 2021-04-14T05:22:05+05:30

మహనీయుల విగ్రహాలు ఆదరణ లేకుండా చిల్డ్రన్స్‌ పార్కులో ఉంచడంతో వాటిని పట్టించుకునే వారు లేక దెబ్బతింటున్నాయి.

ఆదరణ కరువై చిల్డ్రన్స్‌ పార్కులో ఉన్న మహనీయుల విగ్రహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపూర్‌, ఏప్రిల్‌ 13: మహనీయుల విగ్రహాలు ఆదరణ లేకుండా చిల్డ్రన్స్‌ పార్కులో ఉంచడంతో వాటిని పట్టించుకునే వారు లేక దెబ్బతింటున్నాయి. బుధవారం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ విగ్రహాలపై ఆలోచించాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్‌-మెదక్‌ ప్రఽధాన రోడ్డుపై నర్సాపూర్‌ పట్టణ పరిధిలో అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రాం వంటి జాతీయ స్థాయి మహనేతలతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌, ఉప ముఖ్యమంత్రి సీజేఈఆర్‌ విగ్రహాలను గతంలో ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించే క్రమంలో నిబంధనల ప్రకారం విగ్రహాలను తొలగించారు. ఈ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విగ్రహాలను త్వరలోనే అనువైన స్థలంలో ఏర్పాటు చేస్తామని వాటి గౌరవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కొన్నారు. తాత్కాలింగా మండల పరిషత్‌ ప్రాంగణంలో ఉన్న చిల్డ్రన్స్‌పార్కులో వాటిని ఉంచారు. అయితే ఏడాది దాటుతున్నా తిరిగి ఏర్పాటు చేయాలనే ఆలోచన అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిఽధులకు రాకపోవడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా నాయకుల జయంతి, వర్ధంతి సందర్భంగా విగ్రహాల వద్దకు వచ్చి పూలమాల వేసి  వెళ్తున్నారే తప్పా వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

Updated Date - 2021-04-14T05:22:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising