ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాల నుంచి తొలగించడం తగదు

ABN, First Publish Date - 2021-07-27T04:09:19+05:30

ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెప్పించుకుని తమను ఉద్యోగాల నుంచి తొలగించడం తగదని పేర్కొంటూ చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలోని సింప్లీఫ్రెష్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎదుట స్థానిక ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు.

కంపెనీ ప్రధాన ఆవరణలో ధర్నా చేస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్జునపట్ల సింప్లీఫ్రెష్‌ కంపెనీ ఎదుట స్థానిక ఉద్యోగుల ఆందోళన

చేర్యాల, జూలై 26 : ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెప్పించుకుని తమను ఉద్యోగాల నుంచి తొలగించడం తగదని పేర్కొంటూ చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలోని సింప్లీఫ్రెష్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎదుట స్థానిక ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. అర్జునపట్ల గ్రామంలో కొన్నాళ్ల క్రితం కంపెనీ ఏర్పాటు చేశారు. స్థానికులకు ఉద్యోగావకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీమేరకు అర్జునపట్ల, కమలాయపల్లి, దొమ్మాట తదితర గ్రామాలకు చెందిన పలువురు కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను తెప్పించుకుంటూ స్థానికుల్లోని పలువురిని తొలగిస్తామని నిర్వాహకులు తెలిపారు. దీంతో స్థానిక ఉద్యోగులు కంపెనీ ప్రధాన ద్వారం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. తమను మోసగించడం తగదని, యధావిధిగా కంపెనీలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కాసేపటికి కంపెనీ నిర్వాహకులు కొంతమంది ఉద్యోగులను లోపలికి పిలిపించుకుని చర్చించారు. కొంతమంది మినహా మిగతావారిని విధుల్లో చేర్చుకుంటామని తెలపడంతో ఆందోళన విరమించారు. కాగా ఈ విషయమై కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆందోళనకు దిగినవారిలో ఆరుగురి పనితీరులో పలు ఫిర్యాదులు ఉన్నాయని, ఈ విషయమై చర్చించామన్నారు. కరోనా సమయమైనా ఎవరినీ తొలగించలేదని, వివాదాన్ని పరిష్కరించామని వివరణ ఇచ్చారు.

Updated Date - 2021-07-27T04:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising