ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణం.. ప్రయాస

ABN, First Publish Date - 2021-10-20T04:38:47+05:30

గుంతలమయమైన రహదారులతో ప్రయాణం ప్రయాసగా మారింది. గమ్యస్థానానికి చేరుకోవడానికి రెట్టింపు సమయం తీసుకుంటున్నది. గుంతల రోడ్లపై రాత్రవేళ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన కుండపోత వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది.

కంకర తేలిన చంద్లాపూర్‌ రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రహదారులు

103 గ్రామాల్లో 205 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం

పంచాయతీరాజ్‌ పరిధిలో 119.30 కి.మీ., ఆర్‌ఆండ్‌బీ పరిధిలో 86 కి.మీ.

వాహనదారులకు తప్పని తిప్పలు  

ప్రతిపాదనలకే పరిమితమైన మరమ్మతులు


సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 19 : గుంతలమయమైన రహదారులతో ప్రయాణం ప్రయాసగా మారింది. గమ్యస్థానానికి చేరుకోవడానికి రెట్టింపు సమయం తీసుకుంటున్నది. గుంతల రోడ్లపై రాత్రవేళ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన కుండపోత వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. సిద్దిపేట జిల్లాలో 103 గ్రామాల పరిధిలో 205 కిలోమీటర్లమేర రహదారులు, 35 కల్వర్టులు ధ్వంసమయ్యాయి. జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 36 గ్రామాల్లో 119.30 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో పూర్తిగా ధ్వంసమై కంకరతేలిన రోడ్లు 29.28 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ రహదారులు తిరిగి నిర్మించేందుకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు రూ. 13.55 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధంచేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. అలాగే, రోడ్లు భవనాలశాఖకు చెందిన 67 గ్రామాల పరిధిలోని 86 కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ రోడ్ల మరమ్మతు కోసం రూ. 78.90 కోట్లు వ్యయమవుతుందని ఆర్‌ఆండ్‌బీ అధికారులు అంచనా వేస్తున్నారు.


అస్తవ్యస్తంగా రహదారులు

ఇటీవల కురిసిన వర్షానికి రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. సిద్దిపేట డివిజన్‌ ఫరిధిలోని సిద్దిపేట అర్బన్‌, నారాయణరావుపేట, నంగునూరు, చిన్నకోడూర్‌, బెజ్జంకి, కొండపాక, హుస్నాబాద్‌, కోహెడ, అక్కన్నపేట, మద్దూరు, చేర్యాల మండలాల్లో పలు రోడ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు. గుంతల్లోపడి వాహనాలు పాడవుతున్నాయి. రాత్రి వేళ్ల్లల్లో గమ్యానికి చేరుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ విషయంపై ఆయా శాఖ అధికారులు స్పందిస్తూ మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు.

Updated Date - 2021-10-20T04:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising