ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవరు కప్పి.. వదిలేశారు!

ABN, First Publish Date - 2021-12-02T04:56:47+05:30

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా ఉంది ప్రభుత్వ, అధికారుల తీరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.24 లక్షల విలువైన ఆక్సిజన్‌ ప్లాంట్‌కు రక్షణ చర్యలు శూన్యం 

కొరవడిన పర్యవేక్షణ, నిర్వహణ

నాలుగు నెలలుగా నిరుపయోగం..


తూప్రాన్‌, డిసెంబరు 1: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా ఉంది ప్రభుత్వ, అధికారుల తీరు. కరోనా రోగులకు ఆక్సిజన్‌ ఎంతో అవసరం. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి ప్రాణవాయువు అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో పోరాడుతున్న వారికి ఆక్సిజన్‌ను అందించి ప్రాణాలు కాపాడేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ సహాయం చేస్తే ఉపయోగించకపోగా వృథాగా మారింది. మూడోముప్పు ముంచుకొస్తుందని, ఒమైక్రాన్‌ విజృంభిస్తుందని గగ్గొలు పెడుతున్నా పట్టింపేలేకుండా పోయింది. తూప్రాన్‌లోని 50 పడకల ఆస్పత్రిలో కరోనా రోగులు ఆక్సిజన్‌ అందక అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన జడ్పీచైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి హరీశ్‌రావు కృషితో టోరంటో గ్యాస్‌ ఏజెన్సీ తూప్రాన్‌ ఆస్పత్రికి రూ. 24లక్షల విలువైన ఆక్సిజన్‌ ప్లాంటును ఆగస్టులో అందజేసింది. ఈ ప్లాంట్‌ ద్వారా నిమిషానికి 160 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి రోగులకు అందజేసే వీలుంది. సదరు ఏజెన్సీ తూప్రాన్‌ ఆస్పత్రితో పాటు సిద్దిపేట, దుబ్బాక ఆస్పత్రులకు కూడా ఆక్సిజన్‌ ప్లాంట్‌ను అందజేసేందుకు అంగీకరించారు. తూప్రాన్‌కు అందజేసిన ప్లాంట్‌కు సరైన పర్యవేక్షణ, నిర్వహణ లేక నాలుగు నెలలుగా వృథాగా మారింది. ఆస్పత్రి బయట బహిరంగ ప్రదేశంలో ఉండటంతో కవర్‌ కప్పి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం థర్డ్‌వేవ్‌, ఒమైక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్నదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో, ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా కూడా ఆక్సిజన్‌ ప్లాంట్‌పై అధికారులు దృష్టి సారించడంలేదు. ఆక్సిజన్‌ కోసం ఇబ్బందులు పడే బదులు ఉన్న ప్లాంట్‌ను సరిగా వినియోగించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ప్లాం ట్‌ను ఉపయోగంలోకి తీసుకురావడానికి ఓ ప్లాట్‌ఫాం, షెడ్డు అవసరం. షెడ్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు శ్రద్ధ చూపించకపోవడంతో స్వచ్ఛంద సంస్థ అందజేసిన ఆక్సిజన్‌ప్లాంట్‌ వృథాగా మారింది. ఇటీవలనే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అమర్‌ సింగ్‌ కలెక్టర్‌కు లేఖ రాసినట్లు సమాచారం. అధికారులు చొరవ తీసుకుని షెడ్‌ నిర్మాణానికి అవసరమైన నిధులు అందజేస్తే ఆక్సిజన్‌ ప్లాంటు ఉపయోగంలోకి వచ్చే వీలుంది. 


Updated Date - 2021-12-02T04:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising