ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కౌంటర్‌ కేసులను ఎత్తివేయాలి’

ABN, First Publish Date - 2021-10-21T04:27:36+05:30

కొండపాక మండలం ముద్దాపురంలో దాడులకు గురైన దళితులపై, సాక్షులపై పోలీసులు బనాయించిన అక్రమ కౌంటర్‌ కేసులను ఎత్తేయాలని డీబీఎఫ్‌, పీడీఎ్‌సయూ నాయకులు శంకర్‌, శ్రీకాంత్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట అర్బన్‌, అక్టోబరు 20 : కొండపాక మండలం ముద్దాపురంలో దాడులకు గురైన దళితులపై, సాక్షులపై పోలీసులు బనాయించిన అక్రమ కౌంటర్‌ కేసులను ఎత్తేయాలని డీబీఎఫ్‌, పీడీఎ్‌సయూ నాయకులు శంకర్‌, శ్రీకాంత్‌ అన్నారు. బుధవారం జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పి.శంకర్‌ ఆధ్వర్యంలో అదనపు డీసీపీ శ్రీనివాసులుకు బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్‌ చేయకుండా బాధితులపై, సాక్షులపై పోలీసులు కౌంటర్‌ కేసులు పెట్టడం అట్రాసిటీ చట్టానికి తూట్లు పొడవడమేనని ఆరోపించారు. అలాగే సిద్దిపేట రూరల్‌ మండలం పెద్దలింగారెడ్డి పల్లి గ్రామంలో సైతం గ్రామానికి చెందిన రెడ్డి కులస్తులు మాల కులస్తులను సాంఘిక బహిష్కరణ చేస్తూ తీర్మానం చేశారని, వారిని కూడా అరెస్ట్‌ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌ యూ జిల్లా సహాయ కార్యదర్శి విద్యానాథ్‌, టీపీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్‌ శేఖర్‌, బాధితులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T04:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising