ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంగునూరు పాఠశాలలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-09-19T04:53:43+05:30

నంగునూరు పాఠశాలలో శనివారం కరోనా కలకలం రేపింది. మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలడంతో ఆందోళ మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంగునూరు, సెప్టెంబరు 18 : నంగునూరు పాఠశాలలో శనివారం కరోనా కలకలం రేపింది. మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలడంతో ఆందోళ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలో చదువుతున్న ఇద్దరు సోదరులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎంఈవో తగిరెడ్డి దేశిరెడ్డి తెలిపారు. ఒకటో తరగతి, ఐదో తరగతి చదువుతున్న వారి తండ్రికి ఆరు రోజుల క్రితం కరోనా సోకగా ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. అయితే ఐదు రోజుల నుంచి వారి పిల్లలు పాఠశాలకు హాజరవుతున్నారు. తోటి విద్యార్థులు ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలు సురేఖకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆమె ఆ ఇద్దరి విద్యార్థులకు కరోనా టెస్టును చేయించగా వారికి పాజిటివ్‌గా తెలింది. దీంతో పాఠశాల నుంచి విద్యార్థులందరినీ ఇంటికి పంపించారు. వారితో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు విద్యార్థులకు పరీక్షలు చేయించగా వారికి నెగెటివ్‌ వచ్చింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఆదివారం కరోనా పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉపాధ్యాయురాలు తెలిపారు.



Updated Date - 2021-09-19T04:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising