ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడువులోగా చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-05-09T04:51:52+05:30

సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో మూడు చోట్ల చేపట్టిన చెక్‌డ్యాంల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా నీటిపారుదల కన్సల్టెంట్‌ మల్లయ్య సూచించారు.

బీబీపేటలో చెక్‌డ్యాం నిర్మాణ స్థలంలో మ్యాపును పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నీటిపారుదల శాఖ ఉమ్మడి జిల్లా కన్సల్టెంట్‌ మల్లయ్య


కల్హేర్‌, మే 8: సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో మూడు చోట్ల చేపట్టిన చెక్‌డ్యాంల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా నీటిపారుదల కన్సల్టెంట్‌ మల్లయ్య సూచించారు. నల్లవాగుపై సిర్గాపూర్‌ మండలంలో పోచాపూర్‌ వద్ద, కల్హేర్‌ మండలంలోని బీబీపేట్‌, కల్హేర్‌ శివారులో రూ.5.02 కోట్లతో నిర్మిస్తున్న మూడు చెక్‌డ్యాంల పనులను శనివారం ఈఈ మధుసూధన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృఽథా నీటిని చెక్‌డ్యాంల ద్వారా నిల్వవుంచి భూగర్భ జలాలు పెంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వరద సమయంలో ఎత్తిపోతలకు కూడా అవకాశం ఉంటుందని చెప్పారు. వీటి నిర్మాణాలతో కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాలతో పాటు కామారెడ్డి జిల్లా పిట్లం, నిజాంసాగర్‌ మండలాల రైతాంగానికి కూడా ప్రయోజనాలు కలుగుతాయని మల్లయ్య చెప్పారు. నిర్మాణ పనులను వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయనవెంట డీఈఈ జలందర్‌, ఏఈలు సూర్యకాంత్‌, రవీందర్‌ ఉన్నారు.


 

Updated Date - 2021-05-09T04:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising