ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత, గిరిజన దండోరా సభను జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2021-09-17T04:59:05+05:30

నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో చేపట్టిన దళిత, గిరిజన దండోరా సభను జయప్రదం చేయాలని పార్టీ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ రాజుల ఆశిరెడ్డి పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆశిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతీ నియోజకవర్గం నుంచి 5 వేల మంది కార్యకర్తలను తరలించాలి

కాంగ్రెస్‌ కో ఆర్డినేటర్‌ ఆశిరెడ్డి

సంగారెడ్డి టౌన్‌/హత్నూర/చిన్నశంకరంపేట/నర్సాపూర్‌/మెదక్‌, సెప్టెంబరు 16 : నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో చేపట్టిన దళిత, గిరిజన దండోరా సభను జయప్రదం చేయాలని పార్టీ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ రాజుల ఆశిరెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గజ్వేల్‌ సభకు భారీగా తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొన్నశంకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జూలకంటి ఆంజనేయులు, నాయకులు రఘుగౌడ్‌, రుద్రారం ప్రకాశ్‌, బుచ్చి రాములు, గంగేరి శ్రీహరి, వై.ప్రభుగౌడ్‌, కసిని రాజు పాల్గొన్నారు. ఈనెల 17న గజ్వేల్‌ నిర్వహించ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీసీసీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ.హకీం, పార్టీ మండల అధ్యక్షుడు పొట్లచెర్వు కిష్టయ్య అన్నారు. గురువారం దౌల్తాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్‌ సర్పంచ్‌ కొన్యాల వెంకటేశం, యువజన కాంగ్రెస్‌ నర్సాపూర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రియాజ్‌ ఆలీ, నర్సింహారెడ్డి, శశిధర్‌రెడ్డి, మణిదీప్‌, కమలాకర్‌, శ్రీకాంత్‌రెడ్డి, భద్రేష్‌ తదితరులు పాల్గొన్నారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు తరలిరావాలని డీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ జడ్పీటీసీ పోతరాజు రమణ పిలుపునిచ్చారు. గజ్వేల్‌ నిర్వహించే సభతో అధికార పార్టీకి దిమ్మతిరగడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ అన్నారు. గురువారం నర్సాపూర్‌లోని రాష్ట్ర నాయకులు ఆవుల రాజిరెడ్డి, అంజనేయులుగౌడ్‌, రవీందర్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గజ్వేల్‌ సభను జయప్రదం చేయాలని మెదక్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు హఫీజోద్దీన్‌ కోరారు. గురువారం మెదక్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి 50 నుంచి 60 మంది కార్యకర్తలతో గజ్వేల్‌ సభకు తరలివెళ్తామని తెలిపారు. 

Updated Date - 2021-09-17T04:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising