ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతిపై విచారణకు సంతకాల సేకరణ

ABN, First Publish Date - 2021-10-27T04:48:35+05:30

ఉమ్మడి మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరపాలని కోరుతూ ఐఎ్‌ఫటీయూ జిల్లా నాయకుడు గద్దల మహేందర్‌ ఆధ్వర్యంలో మంగళవారం రైతులతో సంతకాల సేకరణ చేపట్టారు.

దూళిమిట్టలో రైతులతో సంతకాలు సేకరిస్తున్న ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దూరు, అక్టోబరు 26: ఉమ్మడి మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరపాలని కోరుతూ ఐఎ్‌ఫటీయూ జిల్లా నాయకుడు గద్దల మహేందర్‌ ఆధ్వర్యంలో మంగళవారం రైతులతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు గుంటిపల్లి శివకృష్ణ ఆధ్వర్యంలో దూళిమిట్ట, తోర్నాల గ్రామాల్లో రైతులతో సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అనేక అక్రమాలు వెలుగు చూసినా కొనుగోలు కేంద్రాల్లో విచారణ జరపడం లేదని మండిపడ్డారు. విచారణను వేగవంతంగా జరిపే వరకు రైతులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రైతులతో సేకరించిన సంతకాల జాబితాతో కలెక్టర్‌కు విన్నవించనున్నట్లు  తెలిపారు. ఈ కార్యక్రమంలో సుద్దాల వినయ్‌, కోల పరశురాములు, రమేష్‌, జహంగీర్‌ పాషా పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-10-27T04:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising