ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో పూజలు

ABN, First Publish Date - 2021-04-21T05:10:00+05:30

కరోనా నుంచి సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలన అభిమానులు, పార్టీ కార్యకర్తలు మంగళవారం ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

సిద్దిపేటలోని వేంకటేశ్వరాలయంలో పూజలు చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట రూరల్‌, ఏప్రిల్‌ 20: కరోనా నుంచి సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలన అభిమానులు, పార్టీ కార్యకర్తలు మంగళవారం ఆలయాల్లో పూజలు నిర్వహించారు. సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడక గ్రామాల నాయకులు మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారిలో దేవేందర్‌, సిద్దిపేట ఆత్మ కమిటీ డైరెక్టర్‌ మల్లేశం, మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ గౌడ్‌, మాజీ ఎంపీటీసీ తిరుపతి, గణేష్‌ తదితరులు ఉన్నారు. రావురూకుల గ్రామంలో సర్పంచ్‌ కవితరవీందర్‌, ఉప సర్పంచ్‌ శ్రీకాంత్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు రాజయ్య, సాయిరెడ్డి, సత్యానందం, రామ్‌రెడ్డి, సత్తిరెడ్డి స్థానిక దుర్గమ్మ ఆలయంలో పూజలు చేశారు. 

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర అర్చక సంఘం ఆధ్వర్యంలో స్థానిక మోహినిపుర వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు కృష్ణమాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట నర్సింహాచార్యులు, వేదాంతాచార్యులు, ప్రసాద్‌, రాములు, భిక్షపతి, శ్రీనివాస్‌, రజిత, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

వర్గల్‌: వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో రాష్ట్ర ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలు యాదవ్‌, ఎంపీపీ జాలిగామ లత, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు, నాయకులు రమేశ్‌గౌడ్‌, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

 


Updated Date - 2021-04-21T05:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising