ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఎస్పీ ముందు కొన్ని సవాళ్లు

ABN, First Publish Date - 2021-08-03T04:56:31+05:30

సంగారెడ్డి క్రైం, ఆగస్టు 2: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో వేధిస్తున్న సమస్యలపై జిల్లా నూతన ఎస్పీ దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని మహబూబ్‌సాగర్‌ చెరువుకట్ట (మినీట్యాంక్‌బండ్‌) అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. సాయంత్రం అయ్యిందంటే చాలు మందుబాబులు కట్టపైచేరి జల్సా చేస్తుంటారు. కట్టపై ఏర్పాటుచేసిన బెంచీలపైనే సిట్టింగ్‌ వేస్తుంటారు. ఈ చెరువుకట్ట పక్కనే ప్రధాన రహదారిపై పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటుచేసి వాహనాలను తనిఖీ చేస్తుంటారు. కానీ కట్టపై మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నా అటువైపు మాత్రం కన్నెత్తి చూడటంలేదు.

ఐబీ చౌరస్తా వద్ద పనిచేయని ట్రాఫిక్‌ సిగ్నల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమస్యల వలయంలో సంగారెడ్డి జిల్లాకేంద్రం

యథేచ్ఛగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు

అసాంఘిక శక్తులకు అడ్డాగా మినీ ట్యాంక్‌బండ్‌

పనిచేయని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌

సంగారెడ్డి క్రైం, ఆగస్టు 2: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో వేధిస్తున్న సమస్యలపై జిల్లా నూతన ఎస్పీ దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని మహబూబ్‌సాగర్‌ చెరువుకట్ట (మినీట్యాంక్‌బండ్‌) అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. సాయంత్రం అయ్యిందంటే చాలు మందుబాబులు కట్టపైచేరి జల్సా చేస్తుంటారు. కట్టపై ఏర్పాటుచేసిన బెంచీలపైనే సిట్టింగ్‌ వేస్తుంటారు. ఈ చెరువుకట్ట పక్కనే ప్రధాన రహదారిపై పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటుచేసి వాహనాలను తనిఖీ చేస్తుంటారు. కానీ కట్టపై మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నా అటువైపు మాత్రం కన్నెత్తి చూడటంలేదు. 

పనిచేయని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌

పట్టణంలోని ప్రధాన చౌరస్తా అయిన ఐబీగెస్ట్‌హౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సిగ్నల్స్‌ పనిచేయకపోవడంతో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వాహనాల రాకపోకలను నియంత్రించలేకపోతున్నారు. సాయంత్రం రద్దీ మరీ ఎక్కువగా ఉండటంతో చౌరస్తా దాటేవరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాహనాలను నడుపుతున్నారు. దీనికి తోడు పట్టణంలో కొందరు పశువులను విచ్చలవిడిగా వదిలివేయడంతో అవి రోడ్లపైనే తిష్ఠవేస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సివస్తున్నది.

యథేచ్ఛగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణ

సంగారెడ్డి పట్టణంలో పాత బస్టాండ్‌ నుంచి పోతిరెడ్డిపల్లి వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురయ్యాయి. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పెద్దసంఖ్యలో దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు పక్క షట్టర్లలోని దుకాణాలవారు కూడా ఫుట్‌పాత్‌పైనే సామగ్రిని పెడ్తుండటంతో నడకదారి ఉన్నదనే విషయం కూడా తెలియడం లేదు.

Updated Date - 2021-08-03T04:56:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising