ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాకలి ఐలమ్మ పోరాట పటిమ ఆదర్శం

ABN, First Publish Date - 2021-01-25T05:48:32+05:30

రజాకార్లకు, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు పిలుపునిచ్చారు.

రుద్రారంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు


మిరుదొడ్డి, జనవరి 24: రజాకార్లకు, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించి, మొక్కలను నాటారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ చాటిన స్ఫూర్తి గొప్పదన్నారు. కాగా పల్లెల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని చెప్పారు. తనకు ప్రతీ ఒక్కరూ సహకరిస్తేనే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం సర్పంచ్‌ శాంతమ్మ, గౌడసంఘం సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి, ఉపసర్పంచు పరశురాములు, ఈసీ సుభాష్‌, టీఏ వాణి, పంచాయతీ కార్యదర్శి ఉషారాణి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-25T05:48:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising