ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితులకు నాణ్యమైన ఇళ్లు కట్టించాలి

ABN, First Publish Date - 2021-07-24T05:25:04+05:30

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.

గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహి స్తున్న నిర్వాసితులు, సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీపీఎం నాయకుల డిమాండ్‌

 ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా


 గజ్వేల్‌, జూలై 23: మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో విజయేందర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ.. నిర్వాసితులకు నిర్మించిన ఇళ్లు వర్షాలకు కూలిపోతున్నాయని, ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఇంటి పైకప్పులు తడిసి పెచ్చులూడుతున్నాయని చెప్పారు.  ఈ విషయాన్ని కాంట్రాక్టర్‌, సూపర్‌వైజర్‌కు తెలపడానికి ప్రయత్నించినా హిందీ వాళ్లు కావడంతో భాషాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా భూనిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. తాత్కాలిక అవసరాలను తీర్చేందుకు ఇంజనీర్లు ఉన్నారని, ఉపాధి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీవో విజయేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు యాదగిరి, నవీన్‌, రాజు, మల్లయ్య, లక్ష్మి, బాలవ్వ, వేములఘట్టువాసులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-07-24T05:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising